Home సినిమా ఇంత దారుణమా.. బడ్జెట్‌ 150 కోట్లు, కలెక్షన్‌ 20 కోట్లు.. ఇండస్ట్రీ షాక్‌! – Sneha News

ఇంత దారుణమా.. బడ్జెట్‌ 150 కోట్లు, కలెక్షన్‌ 20 కోట్లు.. ఇండస్ట్రీ షాక్‌! – Sneha News

by Sneha News
0 comments
ఇంత దారుణమా.. బడ్జెట్‌ 150 కోట్లు, కలెక్షన్‌ 20 కోట్లు.. ఇండస్ట్రీ షాక్‌!


అది ఒక స్టార్ హీరో సినిమా. 150 కోట్ల బడ్జెట్‌తో భారీ ఎత్తున నిర్మాణం జరుపుకుంది. తీరా కలెక్షన్స్ చూస్తే కేవలం 20 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది అత్యంత దారుణమైన కలెక్షన్‌గా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ బడ్జెట్‌కి ఈ స్థాయి కలెక్షన్లు రావడం చాలా అరుదు. వివరాల్లోకి వెళితే.. మలయాళ ఇండస్ట్రీలోనే కాదు, దేశవ్యాప్తంగా నటుడిగా మంచి పేరు తెచ్చుకొని కంప్లీట్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న మోహల్‌లాల్‌కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్‌ ఉంది. దాని పేరు ‘బరోజ్’. ఈ సినిమాను తనే డైరెక్ట్‌గా నిర్ణయించుకొని తొలిసారిగా మెగాఫోన్‌ పట్టుకున్నారు. 2019 ఏప్రిల్‌లో ఈ ప్రాజెక్ట్‌ని ఎనౌన్స్ చేశారు. జిజో పున్నూస్‌ నవల బరోజ్‌: గార్డియన్‌ ఆఫ్‌ డి’గామాస్‌ ట్రెజర్‌ ఆధారంగా ఈ దృశ్యాలను ప్రదర్శించారు.

ఒక పాటు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. 2021 మార్చిలో సినిమా షూటింగ్. అయితే కోవిడ్‌ కారణంగా కథ, స్క్రీన్‌ప్లేతో పాటు కొందరు నటినటులను మార్పు చేయడం వల్ల చాలా ఆలస్యం జరిగింది. అలా డిసెంబర్‌లో మళ్ళీ షూటింగ్‌ స్టార్ట్ చేశారు. 2022 జూలైలో షూటింగ్ పూర్తి చేశారు. పూర్తిగా 3డి ఫార్మాట్‌లో రూపొందించిన ఈ సినిమా షూటింగ్ కొచ్చి, గోవాలలో జరిగింది. రెండు పాటలు బ్యాంకాక్, చెన్నయ్‌లలో తీశారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌కి చాలా సమయం తీసుకోవడం వల్ల రిలీజ్‌ కూడా ఆలస్యమైంది. ఈ కథకు భారీ బడ్జెట్‌ అవసరం కావడంతో నిర్మాత ఆంటోనీ పెరంబవూర్‌ ఎక్కడా రాజీ పడకుండా మంచి ఔట్‌పుట్‌ ​​కోసం విపరీతంగా ఖర్చుపెట్టారు. భారీ సెట్లు, విదేశీ లొకేషన్లు, విదేశాల్లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌.. ఇలా ఒకటేమిటి అన్నీ సమకూర్చారు ఆంటోని. తొలికాపీ సిద్ధమయ్యే నాటికి ఆంటోని 150 కోట్లు ఖర్చు చేశారు.

సినిమా నిర్మాణంలో, పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఎదురైన అన్ని అవరోధాలను అధిగమించి డిసెంబర్ 25న క్రిస్మస్‌ కానుకగా ‘బరోజ్‌ 3డి’ చిత్రం విడుదలైంది. ఈ సినిమా విడుదలై దాదాపు 25 రోజులవుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా కలెక్ట్ చేసింది కేవలం 20 కోట్లు. సినిమా రిలీజ్ రోజు నుంచే నెగెటివ్ టాక్‌ రావడంతో ప్రేక్షకులు థియేటర్లవైపు చూడలేదు. మోహన్‌లాల్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ సినిమా ఇది. అంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన స్టార్‌ హీరో సినిమాకి దారుణమైన కలెక్షన్‌ రావడంతో మలయాళ ఇండస్ట్రీ షాక్‌ అయింది. మోహన్‌లాల్‌కి నిజంగా ఇది పెద్ద అవమానమే. తనను నమ్మి అంత బడ్జెట్ పెట్టి సినిమా నిర్మించిన నిర్మాతకు మళ్లీ మళ్లీ సినిమాలు చెయ్యాల్సిన అవసరం మోహన్‌లాల్‌కి ఎంతైనా ఉంది.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech