Home సినిమా షాకింగ్.. బెయిల్‌పై బయటికొచ్చిన దర్శనం ఏం చేస్తున్నాడో తెలుసా? – Sneha News

షాకింగ్.. బెయిల్‌పై బయటికొచ్చిన దర్శనం ఏం చేస్తున్నాడో తెలుసా? – Sneha News

by Sneha News
0 comments
షాకింగ్.. బెయిల్‌పై బయటికొచ్చిన దర్శనం ఏం చేస్తున్నాడో తెలుసా?


కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా రేణుకా స్వామి హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ హత్య కేసులో దర్శన్‌ ప్రియురాలు పవిత్రగౌడ ఎ1 కాగా, దర్శన్‌ ఎ2గా ఉన్నాడు. వీరితోపాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కొన్ని నెలలపాటు జైలు జీవితం గడిపిన దర్శనం ఓ శస్త్ర చికిత్స కోసం మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చాడు. అనంతరం సాధారణ బెయిల్ కోసం అతని భార్య విజయలక్ష్మీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి దర్శన్‌కు బెయిల్‌ లభించింది. అంతేకాదు, పవిత్రగౌడతోపాటు మిగిలిన 15 మందికి కూడా కోర్టు బెయిల్‌ మంజూలు చేస్తున్నారు. ఈ కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సమర్పించిన సాక్ష్యాలన్నీ నిందితులు నేరం చేశారని నిరూపించేవిగానే ఉన్నాయి. అయినా వారికి బెయిల్ రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇదిలా ఉంటే.. బెయిల్‌పై బయటికి వచ్చిన దర్శనం చేస్తున్న పనులు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. దేశంలోని దేవుళ్లను, దేవతలను దర్శించుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. శ్రీరంగపట్నం తాలుకా ఆరతి అక్కడ వెలిసిన శ్రీ అహల్య దేవి మారెమ్మ దేవస్థానాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నాడు. భార్య విజయలక్ష్మీ, కుమారుడు విఘ్నేష్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజను మేలుకొటే ఎమ్మెల్యే దర్శన్‌ పుట్టణ్ణయ్యతో పాటు భారీ ఎత్తున అభిమానులు కూడా ఉన్నారు. అంతకు ముందు బళ్లారి జిల్లా కురుగోడులోని బసవేశ్వర ఆలయంలో కూడా పూజలు నిర్వహించారు. అంతకుముందెన్నడూ లేని విధంగా ఒక్కసారిగా దర్శనం’ ఇలా వరసగా ఆలయాలను దర్శించుకోవడం, పూజలు నిర్వహించడంపై అందరూ షాక్’ అవుతున్నారు. నిత్యం ఏదో ఒక దేవాలయంలో పూజలు చేస్తూ మానసిక ప్రశాంతతను పొందుతున్నాడు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech