వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు టోకెన్ల జారీ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 30 మంది వరకు ఈ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని ఆసుపత్రుల్లో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అయితే జగన్మోహన్ రెడ్డి పరామర్శ తర్వాత రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన బాధితుల్లో చాలామంది విమర్శలు చేయడం వెనుక వైసీపీ నాయకులు తెల్ల కవర్లు పంపిణీ చేయడమే కారణంగా ఆయన. ఈ వ్యాఖ్యలు పెను సంచలనాన్ని సృష్టించాయి. తెల్ల కవర్లు ఎవరు పంచారు, ఎవరికి పంచారు అన్న దానిపై స్పష్టత ఇవ్వలేకపోయారు ఇది పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. వైసీపీకి చెందిన ఒక పెద్ద నాయకుడు ముందుగా జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్న బాధితులు వద్దకు వెళ్లి తెల్ల కవర్లలో డబ్బులు పెట్టి ఇచ్చినట్టుగా ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. ఆ కవర్లు తీసుకున్న వాళ్లే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ. ఈ ఘటన జరిగిన తర్వాత కూటమికి చెందిన నేతలు కుట్ర కోణాన్ని కూడా బయటకు తీస్తున్నారు. కుట్ర కోణం దాగి ఉందా అనే విధంగా కూడా విచారణ సాగుతుందని హోం మంత్రి అనిత కూడా స్పష్టం చేశారు. వీటిని బలపరిచేలా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కవర్ల పంపిణీ వ్యవహారాన్ని బయటపెట్టారు. అక్కడ ఉన్న సిబ్బంది ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఈ వ్యాఖ్యలను వైసీపీ సీరియస్ గానే తీసుకుంది. ఈ తరహా ఆరోపణలు చేయడం ద్వారా ప్రభుత్వం కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుందని వైసిపి ఆరోపిస్తోంది.
మంత్రి ఆనం ఆరోపణల్లో నిజమెంత.. సీసీ ఫుటేజీ విడుదలలో జాప్యం ఎందుకు.! – Sneha News
6