Home ఆంధ్రప్రదేశ్ టీటీడీ చైర్మన్ వర్సెస్ ఈవో.. ఇద్దరి మధ్య కొరవడిన సఖ్యత, ప్రమాదానికి ఇదీ కారణమేనా.! – Sneha News

టీటీడీ చైర్మన్ వర్సెస్ ఈవో.. ఇద్దరి మధ్య కొరవడిన సఖ్యత, ప్రమాదానికి ఇదీ కారణమేనా.! – Sneha News

by Sneha News
0 comments
టీటీడీ చైర్మన్ వర్సెస్ ఈవో.. ఇద్దరి మధ్య కొరవడిన సఖ్యత, ప్రమాదానికి ఇదీ కారణమేనా.!


తిరుమల తిరుపతి దేవస్థానం.. కోట్లాదిమంది భక్తుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి. స్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. కొండపైకి వచ్చే భక్తులు ఈర్ష్య, ద్వేషాలు వంటివన్నీ వదిలి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటారు. స్వామి సన్నిధిలో ఉన్నంతసేపు ప్రశాంతత చిత్తంతో గడుపుతారు. అయితే, ఇక్కడ పనిచేసే వాటిలో అటువంటి ప్రశాంత చిత్తత కనిపించడం లేదు. అదే ప్రస్తుతం టీటీడీలో ఇబ్బందికర పరిణామంగా మారిందా అంటే అవునన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. టీటీడీలో భక్తులకు మెరుగైన సేవలను అందించాల్సిన కృషి చేయాల్సిన చైర్మన్, ఈవో మధ్య సఖ్యత లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాద ఘటన సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇరువురు తీవ్రంగా వాదులాడుకున్నారు. ఒకరిపై ఒకరు సీఎం చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు చేశారు. చైర్మన్‌గా వచ్చినప్పటి నుంచి తనను చిన్నచూపు చూస్తున్నారని, తనకేమీ చెప్పడం లేదంటూ చైర్మన్ బీఆర్ నాయుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.

దీనికి ఈవో శ్యామలరావు సూచనూ.. నీకేం చెప్పడం లేదు, చెబుతూనే ఉన్నాం కదా అంటూ సమాధానం ఇచ్చారు. దీనిపై స్పందించిన చైర్మన్ ఏం చెప్పావు.? రేపు వైకుంఠ ఏకాదశి అని, ముందు రోజు నుంచి హడావుడి ఉందని, మీరు ఏం చేస్తున్నారు ఆ విషయాలు ఏమైనా చెప్పావా.? చైర్మన్ గా ఉండి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అసహనం వ్యక్తం చేశారు. స్పందించిన ఈవో.. నువ్వు మాకు అన్ని చెప్పేవా.? అంటూ అసహనం వ్యక్తం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ విషయంలో నువ్వేం చేసావు అంటూ ప్రశ్నించారు. నాతో మాట్లాడకుండానే ప్రెస్ మీట్ పెట్టి నీకు నచ్చింది చెప్పేసావు దానివల్ల మాకు ఎంత ఇబ్బంది అవుతుందో.? నీకు ఏమైనా తెలుసా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకానొక దశలో టీటీడీ చైర్మన్, ఈవో సంయమనం కూడా కోల్పోయారు. విచక్షణ మరిచిపోయి మరి వ్యవహరించారు. ఇద్దరు వాదనలను కొద్దిసేపు విన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఇద్దరిపైన తీవ్ర స్థాయిలో మండిపడినట్లు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలో ఉన్నత స్థాయిలోనే సమన్వయ లోపం చూపినట్లు సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు సమీక్షలో పాల్గొన్న అధికారులకు అర్థమైంది. చైర్మన్, ఈవో కనీసం మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అటువంటి పరిస్థితి ఉన్నత స్థాయిలో ఉంటే కింది స్థాయి సిబ్బంది ఎలా సక్రమంగా విధులు నిర్వర్తిస్తారు అన్న ప్రశ్నలు ఈ సమీక్ష అనంతరం ఉత్పన్నమయ్యాయి.

ఈవో అస్సలు పట్టించుకోవడం లేదని, చైర్మన్ అనే గౌరవం కూడా లేదని, ఏదైనా కాస్త చెప్పండి అంటూ బిఆర్ నాయుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఒక్కసారిగా రచ్చ మొదలైంది. ఈవో ఒక్కసారిగా సంయమనం కోల్పోయారు. నీకేం చెప్పడం లేదు అన్ని చెబుతూనే ఉన్నాం కదా అంటూ ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు నువ్వు అంటూ వాడిలాడుకున్నారు. ఇద్దరూ తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగుతుండడంతో జోక్యం చేసుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఈవోను మందలించినట్లు. ఏం మాట్లాడటానికి, ముఖ్యమంత్రి మనందరికీ బాస్ అని, ఆయన ముందు ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ వాణి ట్రస్టులో ఏమైనా అంశాలు ఉంటే నోట్ రూపంలో ఇవ్వలేదని, ఇక్కడ ప్రస్తావిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా సీఎం సమీక్ష సమావేశం వేదికగా చైర్మన్, ఈవో మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ విభేదాలను పరిష్కరిస్తే తప్ప తిరుపతిలో ఈ తరహా సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితి లేదని అందరికీ స్పష్టమైంది. తాజా ఘటనకు ఈ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలే కనిపిస్తున్నాయి. కనీసం మాట్లాడలేని స్థితిలో ఇద్దరూ ఉన్న నేపథ్యంలో తిరుపతి అభివృద్ధికి, భక్తుల మెరుగైన దర్శనానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

క్షమాపణలు చెప్పిన నిర్మాత దిల్ రాజు.. ఆ వ్యాఖ్యలపై వివరణ
జుట్టు ఒత్తుగా, పొడవు పెరగాలంటే 8 యోగాసనాలు చేయండి చాలు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech