గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో అడుగు పెట్టనుంది. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాల తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘డాకు మహారాజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ చేసింది. (నందమూరి బాలకృష్ణ)
‘డాకు మహారాజ్’ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.80 కోట్లకు పైగా బిజినెస్ చేయడం విశేషం. నైజాంలో రూ.17.50 కోట్లు, సీడెడ్‌లో రూ.15.50 కోట్లు, ఆంధ్రాలో రూ.34.30 కోట్లతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి రూ.67.30 కోట్ల బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా రూ.5.40 కోట్లు, ఓవర్సీస్ రూ.8 కోట్లు కలిపి.. ఓవరాల్ గా రూ.80.70 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.81 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. (డాకు మహారాజ్)
బాలకృష్ణ కెరీర్‌లో ఇదే అత్యధిక బిజినెస్. ఆయన గత మూడు చిత్రాలను గమనిస్తే.. అఖండ 53 కోట్లు, వీరసింహారెడ్డి 73 కోట్లు, భగవంత్ కేసరి 67 కోట్ల బిజినెస్ చేశాయి. మరి బిజినెస్ పరంగా కెరీర్ బెస్ట్ రికార్డ్ సృష్టించిన డాకు మహారాజ్, కలెక్షన్స్ పరంగా కూడా అదే రిపీట్ చేస్తుందేమో చూడాలి.