పుష్ప 2(పుష్ప 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో తొక్కిసలాటలో శ్రీతేజ్(sritej)తీవ్ర గాయపడిన విషయం తెలిసిందే. 34 రోజుల నుంచి కిమ్స్ హాస్పిటల్ లోనే శ్రీ తేజ్ చికిత్స తీసుకుంటుండగా రోజుకి బాబు కోలుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్(అల్లు అర్జున్)ఈ రోజు ఉదయం 10 గంటలకు కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి శ్రీ తేజ్ ని పరామర్శించడం జరిగింది.దాదాపుగా 15 నిమిషాల హాస్పిటల్ లో శ్రీ తేజ్ వద్ద ఉన్న అల్లు అర్జున్ బాబు ఆరోగ్యం గురించి డాక్టర్స్ ని అడిగి తెలుసుకున్నారు.కిమ్స్ ఎండి బొడ్డు భాస్కరరావు తో కూడా శ్రీ తేజ్ హెల్త్ విషయం గురించి చర్చ జరిగింది.శ్రీ తేజ్ పూర్తి ఆరోగ్యంగా ఉండేదాకా తనదే బాధ్యత అని కూడా తెలిపినట్లుగా సమాచారం.అల్లు అర్జున్ ఇన్ని రోజులు శ్రీ తేజ్ ని కలవాలని అనుకున్నా కూడా తన మీద నమోదయిన కేసు దృష్ట్యా కలవలేకపోయాడు.కానీ ఇటీవలే నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో శ్రీ తేజ్ ని పరామర్శించాలని అనుకున్నాడు.
ఈ కోరిక కిమ్స్ హాస్పిటల్ ఏరియాకి చెందిన రామ్ గోపాల్ పేట నోటీసులు శ్రీ తేజ్ ని కలవాలంటే మాకు ముందుగా ఇన్ ఫర్మేషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది.ఈ కారణంగానే అల్లు అర్జున్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కిమ్స్ కి రావడం జరిగింది.అల్లు అర్జున్ వెంట దిల్ రాజు(దిల్ రాజు)కూడా కిమ్స్ హాస్పిటల్ కి వచ్చాడు. ఇక అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్(అల్లు అరవింద్)కూడా కొన్ని రోజుల క్రితం శ్రీ తేజ్ ని పరామర్శించిన విషయం తెలిసిందే.ఇక సంధ్య థియేటర్ ఘటనలోనే శ్రీ తేజ్ తల్లి రేవతి చనిపోగా అల్లు అర్జున్ తో పాటు పుష్ప 2 టీం 3 కోట్లరూపాయలని.రేవతి భర్తకి ఫిలిం ఇండస్ట్రీ లోనే పర్మినెంట్ జాబ్ కూడా ఇచ్చారు.