గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(రామ్ చరణ్)శంకర్(శంకర్)కలయికలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్'(గేమ్ ఛేంజర్)సంక్రాంతి కానుకగా ఈ నెల 10న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.ట్రైలర్‌తో పాటు ప్రచార చిత్రాలు కూడా ఒక రేంజ్‌లో మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా గేమ్. చెంజర్ పై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక ఈ రెండు సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.ఈ నేపథ్యంలో మొదటి రోజు ఎన్ని స్క్రీన్స్ షో పడబోతుందమనే చర్చ ఇప్పుడు అందరిలో మొదలయింది ఎందుకంటే నిర్మాత దిల్ రాజు ఇటీవల మాట్లాడుతు గేమ్ చెంజర్ ఫస్ట్ డే భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుందని చెప్పారు.దీంతో తొలి రోజు దేవర(దేవర) ) 8000 స్క్రీన్స్ లో,పుష్ప 2 12000 స్క్రీన్స్ లో షోస్ పడగా గేమ్ చెంజర్ ఎన్ని స్క్రీన్స్ లో షో పడనుందనే ఆసక్తి అందరిలో ఉంది.
తెలంగాణ లో ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ ఘటనతో బెనిఫిట్ షోతో పాటు అధిక రేట్స్ కి టికెట్లు అమ్మకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.ఈ విషయంపై కూడా దిల్ రాజు(దిల్ రాజు)ఇటీవల మాట్లాడుతు సినిమా ధరల విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడబోతున్నానని,ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రకారమే వెళ్తామని చెప్పాడు.ఇక డ్యూయల్ రోల్ చరణ్ నటిస్తున్న గేమ్ చెంజర్ లో కియారా అద్వానీ అంజలి హీరోయిన్లుగా బ్రహ్మానందం,ఎస్ జె సూర్య,సునీల్,సముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు కాగా ఇప్పటికే పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే.