మహాభారత నేపథ్యాన్ని తీసుకొని సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ‘కల్కి 2898ఎడి’ చిత్రం గురించి ఎంతో మంది పండితులు, హిందూ సంఘాలు కొన్ని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అశ్వథ్థామ, కర్ణుడు వంటి దుష్టులనీ, సినిమాలో గొప్పగా చూపించారని చాలా మంది కనిపిస్తారు. సినిమా రిలీజ్ అయి కొన్ని నెలలు గడిచిన తర్వాత తాజాగా ప్రముఖ గీత రచయిత అనంతశ్రీరామ్ కల్కి సినిమా గురించి, అందులోని పాత్రల గురించి కొన్ని విమర్శలు వచ్చాయి. సినిమా పుట్టిన నాటి నుంచి మహాభారత, రామాయణాలను భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో అనంతశ్రీరామ్ మాట్లాడారు. పురాణ విషయాల గురించి, మన సినిమాల గురించి ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
‘వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం.. భారత సాహితీ వాగ్మయ శరీరానికి రెండు కళ్లు లాంటివి. వాటిని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన సినిమాల నుంచి నిన్న, మొన్న విడుదలైన కల్కి సినిమా వరకు కూడా అదే జరిగింది. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను చాలా సిగ్గుపడుతున్నాను. చాలా నిర్మొహమాటంగా చెబుతున్నాను. అది కృష్ణా జిల్లా గడ్డమీద నిలబడి చెబుతున్నాను. అప్పటి సినిమా దర్శకులు, ఇప్పటి సినిమా నిర్మాతలు కృష్ణా జిల్లాకు చెందిన వారైనప్పటికీ పొరపాటుని పొరపాటు అని చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నట్టు కాదు. ఇక్కడ సభలో వున్న సత్యవాణిగారిని అభినవ ద్రౌపది అని అభివర్ణించారు. ద్రౌపది వలువలు ఒలచండి అని సలహా ఇచ్చిన కర్ణుడు గొప్పవాడు అంటే సత్యవాణి వంటి మహిళలు ఒప్పుకుంటారా? గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణ మిత్రుడ్ని కూడా ప్రాణభయంతో పరుగులెత్తించిన కర్ణుడ్ని వీరుడు, ధీరుడు, శూరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? తనకి వచ్చిన సంపదలో కొంత దానం చేస్తే ధర్మరాజు అంతటి గొప్ప దాత అని కర్ణుడ్ని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా?
కల్కి చిత్రంలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనుస్సును పట్టుకున్న అర్జునుడి కంటే, సూర్యుడు ఇచ్చిన ధనుస్సును పట్టుకున్న కర్ణుడు వీరుడని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధనుస్సా, ధర్మమా అని మనం ప్రశ్నించకుండా ఉంటామా? భారతంలోనే కాదు, వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు, రాళ్ళను తేల్చి వారధి కట్టినట్టు, కూడా లవకుశులకు, రాముడికి యుద్ధం జరిగింది.. ఇలా చిత్రీకరణకు అందంగా ఉండేందుకు ఎన్నో అభూత కల్పనలు, ఎన్నో వక్రీకరణలు జరుగుతున్నప్పుడు మనం ఊరుకుంటూ ఉంటే ఇంకా ఎలాంటి సినిమాలు వస్తాయి. చిత్రీకరణలో, గీతాలాపనలో కూడా ఎన్ని రకాల హననాలు జరిగాయో మనం చూశాం, చూస్తున్నాం’ అంటూ ఆవేశంగా మాట్లాడారు అనంత శ్రీరామ్.
అనంత శ్రీరామ్ తన ప్రసంగంలో ప్రత్యేకంగా నటరత్న ఎన్.టి.రామారావును ఉద్దేశించే ఎక్కువ వ్యాఖ్యలు అర్థమవుతున్నాయి. ఎందుకంటే కర్ణుడి కథతో దానవీరశూర కర్ణ అనే టైటిల్‌తో సినిమాను నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. ఆ సినిమాలో కర్ణుడ్ని ఒక గొప్ప కథానాయకుడిగా చూపించారు. అనంత శ్రీరామ్ తన మాటల్లో అప్పటి దర్శకులు, ఇప్పటి నిర్మాతలు కృష్ణా జిల్లా వాసులు అనే మాటను వాడారు. ఎన్టీఆర్, కల్కి చిత్ర నిర్మాత అశ్వనీదత్ ఇద్దరూ కృష్ణాజిల్లాకు చెందిన వారే. వారిని దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు అర్థమవుతున్నాయి. మరి అనంత శ్రీరామ వ్యాఖ్యలపై దర్శకనిర్మాతలు, ఇతర ప్రముఖులు ఎలా కనిపిస్తారో చూడాలి.