గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన కీలక హామీల్లో తల్లికి వందనం పథకం ఒకటి. ఈ పథకంలో భాగంగా ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారో వారికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసే కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో హామీల అమలకు సంబంధించి కీలకమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేసే దిశగా కూటమి నాయకులు ముందుకు కదులుతున్నారు. ఈ కావాలనే అత్యంత కీలకమైన తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారు అన్న చర్చ. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వేసవి సెలవుల తరువాత తిరిగి పాఠశాలలు తెరిచే సమయంలో తల్లులు ఖాతాలో తల్లికి వందనం నగదు జమ అయిన సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకంలో భాగంగా లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేసింది. పాఠశాలల్లో 70 శాతం హాజరు ఉన్న పిల్లలకు మాత్రమే ఈలో భాగంగా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరంలో హాజరు చూసి అర్హత ఉన్నవారికి తిరిగి పాఠశాలలు తెరిచే ముందు డబ్బులు ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తారన్న ఆశతో ఉన్న చాలామందికి ఈ నిర్ణయం మింగుడు పడడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ పథకం కోసం నిరీక్షిస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో సుమారు 60 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి కింద 15000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. వైసీపీ ప్రభుత్వం ఇంటిలో ఒక చిన్నారికి మాత్రమే ఈ పథకంలో భాగంగా లబ్ధిని అందించింది. కానీ కూటమి
తల్లికి వందనం ఈ ఏడాది ఇక లేనట్టే.. వచ్చే ఏడాది నుంచి అమలకు నిర్ణయం – Sneha News
18