రామ్‌చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’పై పుష్ప2 ఎఫెక్ట్ ఎంత పడిందంటే.. ఒక పాన్ ఇండియా మూవీ రేంజ్‌ని ఒక్కసారిగా ఒక నార్మల్ సినిమా రేంజ్‌కి పడిపోయేలా చేసింది. ఇటీవల పుష్ప2 దగ్గర ఘటన సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనను తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపై ఈవెంట్స్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో సెలబ్రిటీలకు కొన్ని సూచనలు చేయడమే కాకుండా, కొన్ని కఠిన నియమాలు కూడా పెట్టారు. ఆ ప్రకారమే ఎంత పెద్ద ఈవెంట్ అయినా జరగాలి అని ఆదేశించింది పోలీస్ శాఖ. అందులో భాగంగానే గురువారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎంబి మాల్‌లో ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ జరుగుతోంది. అయితే ఎప్పుడూ లేని విధంగా అక్కడి వాతావరణం కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. అందులోని ఒక థియేటర్‌లో ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.
సాధారణంగా మాల్ ఎంట్రన్స్‌లో, థియేటర్స్ ఉన్న ఫ్లోర్‌లో ఎన్నో స్టాండీ ఫ్లెక్సీలు దర్శనమిస్తాయి. కానీ, ఈ విషయంలో గేమ్ ఛేంజర్ అందరికీ షాక్ ఇచ్చింది. థియేటర్ బయట ఒక్క స్టాండీ ఫ్లెక్సీ కూడా లేకుండా ఈవెంట్ జరగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఎక్కడైతే ఈవెంట్ జరుగుతుందో ఆ నిర్ణీత ప్రదేశం దాటి ఎలాంటి పబ్లిసిటీగానీ, ఫ్లెక్సీలుగానీ కనిపించకూడదని పోలీసు శాఖ సూచన. ఆ ప్రకారమే.. ఎంతో సైలెంట్‌గా, ఎలాంటి హడావిడి లేకుండా గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరుగుతోంది. దీన్నిబట్టి పుష్ప2 ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్‌పై ఎంత గట్టిగా ఉందో అర్థమవుతోంది.