పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)దర్శకుడు హరీష్ శంకర్(harish shankar)కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.2012 లో ఆ ఇద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా,అనేక రికార్డులని కూడా సృష్టించింది. పైగా పవన్ ని వరుస ప్లాప్ ల నుంచి బయటపడేసిన మూవీగా కూడా గబ్బర్ సింగ్ కి అభిమానుల్లో ప్రత్యేక స్థానం ఉంది.
దీంతో ఈ కాంబోలో మరోసారి తెరకెక్కుతున్న’ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి.దీంతో హరీష్ శంకర్ పై ఇప్పుడు తీవ్ర ఒత్తిడి ఉందని చెప్పవచ్చు.ప్రీవియస్ మూవీ మిస్టర్ బచ్చన్ భారీ డిజాస్టర్ ని అందుకుంది. కూడా వచ్చాయి.ఈ ప్రభావం ఖచ్చితంగా ‘ఉస్తాద్’ పై ఉండబోతుంది.విజయ్ హీరోగా తమిళంలో తెరకెక్కించారు ‘తేరి'(తేరి)కి ‘ఉస్తాద్’ రీమేక్ అనే ప్రచారం ఉంది.ఇప్పటికే ‘పోలీసోడు’ అనే టైటిల్‌తో తెలుగులోకి డబ్ అవ్వడం,చాలా మంది ప్రేక్షకులు చూడటం కూడా జరిగింది. లేటెస్ట్ గా హిందీలో ‘బేబీ జాన్’ గా రీమేక్ అయ్యి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.దీంతో ‘ఉస్తాద్’రూపంలో హరీష్ కి నూటికి నూరు శాతం టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు. మరి పవన్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని’ఉస్తాద్’ విషయంలో హరీష్ ఏమైనా మార్పులు చేశాడా! మన ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఎలాంటి కమర్షియల్ హంగులు అద్దుతున్నాడనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.’గబ్బర్ సింగ్’ కూడా సల్మాన్ హీరోగా వచ్చిన ‘దబాంగ్’ కి రీమేక్ అయినా కూడా, పవన్ కోసం హరీష్ చాలా మార్పులు చేసిన విషయం తెలిసిందే.
పవన్ అప్ కమింగ్ మూవీస్ హరిహరవీరమల్లు, ఓజి తర్వాతనే ‘ఉస్తాద్’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ని పూర్తి చేసుకోగా,అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది.పవన్ సరసన శ్రీలీల(sreeleela)జత కడుతుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కి మంచి పేరు వచ్చింది.మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీజర్ లోని డైలాగులని ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వాడుకోవడం కూడా జరిగింది.