ఏడాది మొత్తం ఎలా ఉన్నా డిసెంబర్ నెల వచ్చిందంటే.. ప్రారంభం నుంచే థర్టీ ఫస్ట్ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఇయర్ ఎండిరగ్‌కి సంబంధించిన సెలబ్రేషన్స్, ఎంజాయ్‌మెంట్ ఒక రేంజ్‌లో కాబట్టి ఆ డేట్‌కి అంత ప్రాధాన్యత ఉంటుంది. దానితో పాటే కొత్త సంవత్సరం మొదటిరోజు కూడా ఆ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతుంటాయి. ఈ గోల్డెన్ మూమెంట్స్‌ని ఎవరి రేంజ్‌కి తగ్గట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇక మూవీ స్టార్స్ విషయానికి వస్తే.. ఒక్కొక్కరు ఒక్కో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని ప్లాన్ చేసుకుంటారు. కనీసం వారం రోజుల ముందు మీకు ఇష్టమైన హాలీడే స్పాట్స్‌కి చేరుకుంటారు. దాదాపుగా హీరోలంతా ఫ్యామిలీలతోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అంతేకాదు, విదేశాల్లోనే వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా అలాంటి ప్లానింగ్‌లోనే ఉన్నారు టాలీవుడ్ హీరోలు. అయితే వారిలో ముగ్గురు హీరోలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ముగ్గురు హీరోలు ఎవరో తెలుసుకుందాం.
సాధారణంగా ప్రభాస్ కొత్త సంవత్సరం వేడుకలను విదేశాల్లోనే జరుపుకుంటారు. వెకేషన్ కోసం లండన్ వెళ్ళడానికే ఎక్కువ ఇష్టపడే ప్రభాస్.. అక్కడ ఏకంగా ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడని, భారీగా అద్దె చెల్లిస్తారని ఆమధ్య వార్తలు వచ్చాయి. ఈసారి రొటీన్‌కి భిన్నంగా జపాన్ వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. అయితే అనుకోకుండా ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇటీవల షూటింగ్‌లో ప్రభాస్ గాయపడ్డారు. దాన్నుంచి కోలుకుంటున్నప్పటికీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం మాత్రం లేదు.
ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్‌కి వెళ్తారు. అయితే ఈ ఏడాది మాత్రం కొత్త సంవత్సరం వేడుకలకు బన్నీ దూరంగా ఉండాల్సి వస్తోంది. పుష్ప2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, మహిళ మరణం కేసులో అల్లు అర్జున్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఆ కారణంగా బన్నీ విదేశాలకు వెళ్ళే అవకాశం లేదు. ఇక్కడ కూడా వేడుకలకు దూరంగా ఉంటాడని. ఎందుకంటే తన సినిమా కారణంగా ఒక కుటుంబం విషాదంలో ఉన్నప్పుడు తను అలా సెలబ్రేట్ చేసుకోవడం కరెక్ట్ కాదనే భావన అల్లు అర్జున్‌కి ఉన్నట్లు ఉంది. కాబట్టి ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి అల్లు అర్జున్ దూరం అంటే చెప్పాలి.
రామ్‌చరణ్ కూడా ప్రతి ఏడాది కొత్త సంవత్సరం కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకుంటారు. ఇలాంటి సందర్భాలను విదేశాలలో చేసుకుంటారు. కానీ, ఈ ఏడాది చరణ్ ఎక్కడికీ కదిలే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే మరో పది రోజుల్లో తన కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కాబోతోంది. ఇలాంటి టైమ్‌లో సినిమా ప్రమోషన్స్‌ను వదిలి పెట్టి ఎక్కడికీ వెళ్ళలేరు. కాబట్టి చరణ్ సెలబ్రేషన్స్ అన్నీ అతని ఇంట్లోనే జరుగుతాయి. మిగిలిన హీరోల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ఇప్పటికే కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్ చేరుకున్నారు. థర్టీఫస్ట్ కంటే ముందే అక్కడికి వెళ్లిన ఎన్టీఆర్ లండన్ వీధుల్లో విహరిస్తున్నారు. అయితే న్యూ ఇయర్ టైం కి అతను ఎక్కడ ఉంటారో చూడాలి. విదేశీ పర్యటనలంటే ఎక్కువ ఇష్టపడే మహేష్ పేరునే ప్రథమంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కాస్త టైం దొరికినా ఫ్యామిలీతో ఫారిన్ చెక్కేస్తుంటారు మహేష్. ఈ సంవత్సరం తన వెకేషన్‌కి స్విట్జర్లాండ్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే అలాగే నమ్రత అక్కడికి చేరుకున్నారు. తర్వాత మహేష్ జాయిన్ అవుతారని సూచిస్తుంది.
ఇక కొత్త పెళ్లికొడుకు నాగచైతన్యకి ఈ న్యూయర్ చాలా ఇంపార్టెంట్ అనే విషయం తెలిసిందే. భార్య శోభితతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అయితే ఎక్కడికి వెళుతున్నారు, ఇప్పుడెక్కడ ఉన్నారు అనేది మాత్రం తెలియరాలేదు. ఇక హీరో రానా తనకెంతో ఇష్టమైన ముంబై చేరుకున్నారు. అక్కడ ఓ ప్రైవేట్ పార్టీలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఏది ఏమైనా ఈసారి టాలీవుడ్ స్టార్స్ అందరూ ఏదో ఒక చోట న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. కానీ, ఆ ముగ్గురు స్టార్స్ మాత్రం ఈ విషయంలో అన్ హ్యపీ అని చెప్పాలి.