Home ఆంధ్రప్రదేశ్ ఏపీ కొత్త ఎస్సై విజయానంద్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం – Sneha News

ఏపీ కొత్త ఎస్సై విజయానంద్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం – Sneha News

by Sneha News
0 comments
ఏపీ కొత్త ఎస్సై విజయానంద్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం


ఏపీ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ప్రధాన కార్యదర్శిగా కే విజయానంద్ ను సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. అనంతరం ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యాయి. కాగా ఈ పోస్టుకు ముగ్గురు సీనియర్ ఐఎస్ అధికారుల పేర్లు వినిపించాయి. వీరిలో జి సాయి ప్రసాద్ పేరు ప్రముఖంగా తెరమీదకు వచ్చింది. అయితే సర్వీస్ ఇంకా ఉండటంతో విజయానంద్ వైపు చంద్రబాబు ముగ్గు చూపారు. కాగా తనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజయానంద్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించి జీవో జారీకి ముందు సీనియర్ ఐఎస్ అధికారులు సాయిప్రసాద్ విజయానందతో ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఇద్దరు సీనియర్లే అయినా ప్రత్యేక పరిస్థితుల్లో విజయానందుకు ఎస్‌ఎస్‌గా అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఇద్దరూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సీనియర్ ఐఏఎస్ ల సహాయ, సహకారాలు ప్రభుత్వానికి చాలా అవసరమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వారిద్దరికీ సూచించారు.

ఇదిలా ఉంటే తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కే విజయానంద్ ఉమ్మడి కడప జిల్లాకు చెందిన వారు. 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన ఉమ్మడి, విభజన ఏపీలో కీలక పోస్టుల్లో పని చేశారు. విద్యుత్ సహా పలు రంగాలలో మంచి పట్టు సాధించారు. 1993లో తొలుత ఆదిలాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా విధుల్లో చేరిన ఆయన 1996లో రంపచోడవరం సబ్ కలెక్టర్ గా, గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టుగా పనిచేశారు. 1997, 2007 మధ్య ఉమ్మడి ఏపీలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేశారు. అనంతరం శ్రీకాకుళం, నల్గొండ జిల్లాలో కలెక్టర్ గా సేవలందించారు. 2016 – 2019 మధ్య ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. 2019 – 21 మధ్య రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా విధులు నిర్వహించారు. ప్రస్తుత ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2022లో ఏపీ జెన్‌కో చైర్మన్‌గా ఉన్న ఆయన 2023లో ట్రాన్స్‌కో చైర్మన్ ఎండి సేవలు అందించారు. విద్యుత్ రంగంలో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. దక్షిణాది రాష్ట్ర విద్యుత్ రంగంపై అవగాహన ఉండటంతోపాటు విద్యుత్ ఉత్పత్తి ప్రసారం పంపిణీపై అపారమైన అనుభవం ఆయన సొంతం చేసుకున్నారు. ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ రంగానికి సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు వాటి పరిష్కారానికి ఆయన ఇచ్చిన సలహాలు ఎంతగానో దోహదపడ్డాయి.

పడక గదిలో పురుషులు బల ప్రదర్శన చేయాలంటే ఏం చేయాలో తెలుసా..
గుండె లేని జీవ రాశులు ఇవే..

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech