సంక్రాంతి పండుగకు హైదరాబాదు నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. పండగ నాలుగు రోజులు హైదరాబాదు ఖాళీగా ఉంటుంది. పండగకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు నిర్ణయించింది. 2,400 స్పెషల్ సర్వీస్‌లను నడపాలని ఏపీఆర్టీసీ నిర్ణయించింది. ఈ స్పెషల్ సర్వీస్‌లు అదనపు చార్జీలు లేకుండానే నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. రెగ్యులర్ గా నడిచే బస్సులతోపాటు ఈ స్పెషల్ బస్సులో నడుపుతామని అధికారులు చెప్పారు. సంక్రాంతికి నడపనున్న ఈ స్పెషల్ బస్సుల్లో రెగ్యులర్ చార్జీలే ఉంటాయని, అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాదులోని పెద్ద బస్టాండ్ ఎంజీబీఎస్ లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. అందులోనూ పండగ సమయం కావడంతో ఆరోగ్యం తగ్గించేందుకు జనవరి 10వ తేదీ నుంచి 12 వరకు ఆర్టిసి కొన్ని మార్పులు చేసింది. ఒంగోలు, మాచర్ల, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వైపు వెళ్లే రెగ్యులర్ బస్సులతోపాటు సంక్రాంతి స్పెషల్ బస్సులను ఎంజీబీఎస్ కు ఎదురుగా ఉన్న పాత సిబిఎస్ గౌలిగూడ నుంచి నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఈ విషయాలను గమనించాలని ఆర్టీసీ సూచించింది. పండగ సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ భారీగా ధరలను పెంచి ప్రయాణికులను దోచుకుంటారు. ఇటువంటి ఇబ్బందుల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కల్పించే ఉద్దేశంతో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.
సంక్రాంతికి ప్రత్యేక రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి..
సంక్రాంతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైలును ప్రవేశపెట్టినట్లు వాల్తేరు రైల్వే సీనియర్ డిసిఎం కె సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 10 నుంచి 20 వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటలకు విశాఖ – పార్వతీపురం – విశాఖ మధ్య ఒక ప్రత్యేక రైలు నడవనుంది. అలాగే జనవరి 5, 12 తేదీల్లో సాయంత్రం నాలుగు 35 గంటలకు సికింద్రాబాద్ – విశాఖ – సికింద్రాబాద్ మధ్య మరో ప్రత్యేక రైలు నడవనుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 6, 13 తేదీల్లో రాత్రి 7:50 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. అలాగే హైదరాబాద్ – కటక్ – హైదరాబాద్ వయ దువ్వాడ మీదుగా జనవరి 7, 14, 21 తేదీల్లో రాత్రి 8 10 గంటలకు హైదరాబాదులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 5 గంటలకు వద్దు, వాడు చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 8, 15, 22 తేదీల్లో రాత్రి 10:30 గంటలకు కటక్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:35 గంటలకు దువ్వాడ, రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ – సికింద్రాబాద్ వయ దువ్వాడ రైలు జనవరి 3, పదో తేదీల్లో రాత్రి 8:15 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి వరుస రోజు ఉదయం 9.22 గంటలకు దువ్వాడ మధ్యాహ్నం రెండు 45 గంటలకు బ్రహ్మ పూరి చేరుతుంది. ఇదే రైలు జనవరి 4, 11 తేదీల్లో సాయంత్రం 4:45 గంటలకు బ్రహ్మపూర్ లో బయలుదేరి రాత్రి 9.55 గంటలకు దువ్వాడ మరుసటి రోజు ఉదయం 11:35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సంక్రాంతికి ప్రత్యేక ప్రయాణాలు సాధించే ప్రయాణికులు ఈ రైళ్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు.. చంద్రబాబు వద్దన్నా ఆగడం లేదంటూ పేర్ని ఆవేదన
2025లో థియేటర్లలో రాబోయే తెలుగు మూవీస్ ఇవే!