‘దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ తొలగాలి.. ఈ అజెండాతోనే ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల దేవాలయాలపై నియంత్రణను హిందూ సంఘాలకే అప్పగించాలి’ అని విశ్వహిందూ పరిషత్తు ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మిలింద్ పరాండే అన్నారు. మేనేజ్‌మెంట్, నిత్య కైంకర్యాలు.. ఇలా దేవాలయాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు, హిందూ సంఘాలకే చెందాలని, దీనికోసం విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమానికి సిద్ధమయ్యామని తెలిపారు. ‘జనవరి 5 నుంచి దేశవ్యాప్తంగా హిందూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం. దీనికోసం జనవరి 5న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హైందర శంఖారావాన్ని పూరించబోతున్నాం. ఈ భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలి రావాలని కోరుతున్నాం. సుప్రీం కోర్టు తలంటినా ప్రభుత్వాలు.. హైకోర్టు భూములను తమ స్వాధీనంలోనే ఉంచుకుంటున్నాయి. తమలోనే బాధ్యతలు ఉండేలా నియంత్రణ. మసీదులు, చర్చిలకు లేని కండిషన్లు.. వివక్ష కేవలం హిందువులపై చూపడం అత్యంత హేయం. ఎలయాల నిర్వహణ బాధ్యత, నియంత్రణ హిందూ సంఘాల చేతికే అప్పగించాలి. దేవుడిని నమ్మేవారికి మాత్రమే ఆలయాల్లో ప్రాతినిథ్యం కల్పించాలి. దీనికోసం ఒక మేధావి వర్గాన్ని సిద్ధం చేశాం. అందులో ప్రముఖ న్యాయవాదులు, హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్‌లు, సంత్ సమాజ్ పెద్దలు, వీహెచ్‌పీ కార్యకర్తలు ఉన్నారు. ఆలయాల్లో ప్రొటోకాల్స్, బాధ్యతలను పూర్తిగా పరిశోధన చేసి ఒక డ్రాఫ్ట్‌ను సిద్ధం చేశాం. ఎలాంటి సమస్యకైనా వెతికే దిశగా చర్యలు చేపట్టాం. రాష్ట్ర స్థాయిలో ధార్మిక కౌన్సిల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అందులో ధర్మాచార్యులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, హిందూ సమాజంలోని పెద్దలు, ఆగమ శాస్త్రం తెలిసిన అనుభవజ్ఞులు ఉంటారు. ఈ రాష్ట్రస్థాయి కౌన్సిల్స్.. జిల్లా స్థాయి కౌన్సిళ్లను ఎన్నుకుంటాయి. స్థానిక ఆలయాలకు ట్రస్టీలను నియమిస్తాయి. ఎస్సీలు, ఎస్టీలు అన్న భేదం లేకుండా అన్ని వర్గాలను కలుపుకొని కౌన్సిళ్లను ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి డ్రాఫ్ట్‌ను అందజేశాం. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పార్టీలతోనూ చర్చించాం. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నరాలకు మెమోరాండం అందజేశాం. ఇప్పుడు ఇక.. హిందూ సమాజాన్ని జాగృతి చేయాల్సిన అవసరం ఏర్పడింది. దేవాలయాల స్థిర, చరాస్థులను కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. అందుకే హైందవ శంఖారావాన్ని పూరిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
”హిందూ వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఆలయాలను హిందూ సంఘాలకే అప్పగించాలి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టికల్ 12, 25, 26కు పాతరేశాయి. మసీదులు, చర్చిలు ఆయా మతస్థుల ఆధీనంలో ఉండగా, హిందువులపైనే వివాదం ఎందుకు?’’
– మిలింద్ పరాండే, విశ్వహిందూ పరిషత్తు జనరల్ సెక్రటరీ
వీహెచ్‌పీ డిమాండ్‌లు ఇవి..
- ఆలయాలు, దేవాదాయశాఖల్లో పనిచేస్తున్న అన్యమతస్థులను తొలగించాలి.
- హిందూత్వాన్ని ఆచరించేవారు, దైవాన్ని నమ్మేవారిని మాత్రమే దేవాలయాల్లో ఉద్యోగులుగా నియమించాలి.
- ఏ రాజకీయ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైనా సరే.. ఆలయ ట్రస్టు బోర్డు, యాజమాన్యాల్లో ఉండకూడదు.
- ఆలయ భూముల్లో ఆక్రమణలు తొలగించాలి. అన్యమతస్థుల కట్టడాలను తొలగించాలి.
- ఆలయాల్లో, ఆలయ ప్రాంగణాల్లో హిందువుల దుకాణాలు మాత్రమే ఉండాలి.
- ఆలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని హిందూ ధర్మం కోసమే ఉపయోగించాలి. హిందూ సేవలకు మాత్రమే వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆలయ ఆదాయాన్ని వాడరాదు.
Daily Horoscope | ఈ రోజు రాశిఫలాలు 28 డిసెంబర్ 2024
2025లో థియేటర్లలో రాబోయే తెలుగు మూవీస్ ఇవే!