సూపర్ స్టార్ మహేష్ బాబు(మహేష్ బాబు)వాయిస్ ఓవర్ తో తెలుగు నాట డిసెంబర్ 20న రిలీజైన పాన్ వరల్డ్ మూవీ ‘ముఫాసా'(ముఫాసా).నాలుగు సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది లయన్ కింగ్’ మూవీ కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు మంచి ప్రేక్షకాదరణతో ముందుకు దూసుకుపోతుంది. .
రీసెంట్ గా చిత్ర బృందం ‘ముఫాసా’ఇండియాలో సాధించిన మొదటి వారం కలెక్షన్స్ ని ప్రకటించింది.దేశ వ్యాప్తంగా మొత్తం 74 కోట్లు వసూలు చేయగా,ఇంగ్లీష్ లో 26 .75 కోట్లు, హిందీ,తెలుగు భాషల్లో 11 .2 కోట్లు,11 .3 కోట్లతో మొత్తం 74 కోట్లు రాబట్టింది.మాములు హీరోల స్థాయిలో ‘ముఫాసా’ మొదటి వారానికే రికార్డు స్థాయి కలెక్షన్ ని రాబట్టడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరుస్తుంది.
తాజాగా ‘ముఫాసా’ గురించి మహేష్ బాబు మాట్లాడటం మనకు తెలిసిన ఇష్టపడే పాత్రకు కొత్త అంకం.’ముఫాసా’ కి వాయిస్ అందించినందుకు చాలా ఆనందంగా ఉంది.ఈ క్లాసిక్ కి నేను విపరీతమైన అభిమానిని.కాబట్టి ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకంగా చెప్పాడు.ముఫాసా ని ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ 200 మిలియన్ డాలర్లతో నిర్మించగా బేరి జెన్కీన్స్ దర్శకత్వం వహించాడు.