ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన వ్యవహారం చినికి గాలి వానలా మారింది. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్ళవచ్చు. ఈ వ్యవహారంపై స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తాజాగా సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా. అయితే టాలీవుడ్ ప్రముఖ నటుడు, సినీ రంగానికి పెద్దదిక్కుగా ఉన్నా చిరంజీవి మాత్రం హాజరు కాలేదు. అదే సమయంలో టాలీవుడ్ కీలక నటుడిగా ఉన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు స్పందించలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. దూరంగా ఉన్న వాళ్ళు ఫోన్లు చేసి మరి తమ సానుభూతిని తెలియజేసారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. ఈ వ్యవహారాన్ని ఆధారంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇబ్బందులు పెడుతూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సినిమా టికెట్లు పెంచేందుకు అంగీకరించబోమని, బెనిఫిట్ షోలకు అనుమతిబోమంటూ తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. ఇది టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దెబ్బగానే భావించాలి. ఇన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు. ఇదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంలో కావాలంటే స్పందించకుండా ఉంటున్నారా.? లేకపోతే వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించారా.? అన్నది తెలియాల్సి ఉంది. గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ జీవో విడుదల చేశారు. ఈ వ్యవహారంపై సినీ రంగానికి చెందిన ఎంతోమంది తీవ్రస్థాయిలో వ్యాఖ్యానాలు చేశారు. పవన్ కళ్యాణ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి మరి జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
దేహి అంటూ సినీ రంగానికి చెందిన అగ్ర నటులను అడుక్కునేలా, తాము పెట్టుబడి పెట్టి సినిమా తీసేయడానికి మీ పెత్తనం ఏంటి అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఆ తరువాత నాని వంటి నటులు కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే వైసీపీని లక్ష్యంగా చేసుకొని అప్పట్లో వీరంతా మాట్లాడారంటూ సామాజిక మాధ్యమాలు వేదికగా విమర్శలు వ్యక్తం అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ జీవో విడుదల చేసిన దానిపై అంతలా మాట్లాడిన పవన్ కళ్యాణ్, నాని వంటి వారు ఇప్పుడు కనీసం స్పందించడం లేదన్న ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడానికి అల్లు అర్జున్ వ్యవహరించిన తీరే కారణంగా కొందరు ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాల్సివస్తే రాజకీయంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్న భావన మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఆస్తులు వంటివి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్న ఆలోచన కూడా పవన్ మౌనాన్ని దాల్చడానికి కారణంగా మరికొందరు విశ్లేషిస్తున్నారు.
అదే అసలు కారణమై ఉంటుందా.?
సామాజిక మాధ్యమాల్లో పవన్ కళ్యాణ్ మౌనం దాల్చడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ పవన్ మౌనం వెనుక అసలైన కారణం ఒకటి ఉందని అంటున్నారు. అదే రాజకీయంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న స్థానంలో ఉండటం వల్లే నేరుగా ఈ వ్యవహారంపై స్పందించలేని పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడితే సినీ నటుడిగా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా స్పందించినట్లు అవుతుందని, కాబట్టి ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ఆచితూచి చెబుతున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మౌనం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
Daily Horoscope | ఈ రోజు రాశిఫలాలు 27 డిసెంబర్ 2024
డిసెంబర్‌లో ప్రకృతి ప్రసాదించే పండ్లు, కూరగాయలు ఇవే..