యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్(kamal haasan)నటవారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన శృతి హాసన్(shruthi haasan)తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.శృతి హాసన్ ఒక్క సినిమాలో హీరోయిన్ గా చేసిందంటే చాలు,ఇక ఆ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ ని కూడా సంపాదించుకుంది. పైగా ఆ సినిమా హీరో తాలుకు కెరిరీలోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించే మూవీగా కూడా నిలుస్తుంది.ఇక శృతి పర్సనల్ లైఫ్ ని చూసుకుంటే శంతను హజారికా,మైకేల్ కోర్సెల్ అనే ఇద్దరితో చాలా కాలం డేటింగ్ చేసి, ఆ తర్వాత ఆ ఇద్దరనుంచి విడిపోయి ఇప్పుడు సింగల్ గా ఉంటుంది.
రీసెంట్ గా శృతి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.అందులో ఆమె మాట్లాడటం నేను గతంలో పెళ్లి చేసుకోనని చెప్పాను కానీ, ఎప్పటికీ చేసుకోలేదు. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు.రిలేషన్‌లో ఉండటాన్ని చాలా ఇష్టపడతాను.రొమాంటిక్ గా ఉండటం నాకు ఇష్టం.నా చుట్టూ ఉంటే వారితో చనువుగా ఉంటాను.భవిష్యత్తులో ఎవరైనా నా మనసుకి నచ్చితే పెళ్లి చేసుకుంటాను.ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం.నా స్నేహితులు, బంధువులు ఎంతో మంది పెళ్లి చేసుకున్న తర్వాత చాలా సంతోషంగా ఉంటారు. .
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శృతి హాసన్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా నేను సింగల్ గా ఉన్నాను,రిలేషన్ కోసంఎదురుచూస్తున్నాను. ఆమె సినీ కెరీర్ ని చూసుకుంటే ప్రస్తుతం రజనీకాంత్(rajinikanth)లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj)ల కూలీ మూవీలోను, ప్రభాస్(prabhas)ప్రశాంత్ నీల్(prashanth neel)ల సలార్(salaar)పార్ట్ 2 లోను హీరోయిన్ గా చేస్తుంది.