ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జానీ మాస్టర్)తనని వేధింపులకి గురి చేసి సెప్టెంబర్ 15న ఆయన దగ్గర వర్క్ చేసిన లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.దీంతో ఫోక్సో చట్టం కింద జానీ మాస్టర్ అరెస్ట్ కావడంతో కొన్ని రోజులు జైలులో ఉన్నాడు.ఆ తర్వాత హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నాడు.తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ పై దాడి చేసినట్టుగా పోలీసులు నిర్దారించి కేసుకి సంబంధించిన ఛార్జ్ షిట్ నమోదు చేశారు.
ఈ రోజు మీడియా ఛానల్స్ లో జానీ మాస్టర్ గురించి రకరకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి.వాటిపై జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేసాడు.అందులో తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడటం మీడియాలో ఏదైతే స్క్రోల్ అవుతుందో,వాటన్నింటికి నా సమాధానం ఒక్కటే.న్యాయస్థానంలో నాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.న్యాయస్థానంలో ఈ పని చేస్తుంది. ,నా ఫ్యామిలీతో పాటు తెలిసిన వాళ్లతో హ్యాపీగా ఉన్నాను.నా అంతరాత్మకి తెలుసు ఏం జరిగిందో.ఆ విషయం దేవుడికి కూడా తెలుసు.న్యాయస్థానంలో నేను క్లీన్ చిట్ తో నిర్దోషిగా బయటకి వస్తాను.
ఆ రోజున అందరూ మాట్లాడతాను.అప్పటి వరకు కేవలం నేను నిందితుడిని మాత్రమే.నాపై మీరు చూపించే ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలి.ఇలానే ఉంటుంది.నాకు తెలిసిందల్లా ఒక్కటే నాకు తెలిసిన పనితో బాగా కష్టపడుతూప్రేక్షకులని ఎంటర్ టైన్ చేసాను.ఎప్పుడు కూడా నాకొచ్చే విద్యతో మిమ్మల్ని అలరించను. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మీరు నా పై చూపించే అభిమానమే, ఐ లవ్ యు ఆల్.జై హింద్ అని వీడియోలో చెప్పుకొచ్చాడు.