తెలుగు చిత్ర సీమలో సూపర్ స్టార్ కృష్ణ(కృష్ణ)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. డై హార్ట్ కోర్ ఫ్యాన్స్ కి పెట్టింది పేరైన కృష్ణ సుమారు 350 సినిమాల వరకు నటించి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిర స్థాయిగా కొలువు తీరిపోయారు.
ఇక ఆయన నటించిన చివరి చిత్రం పేరు “ప్రేమచరిత్ర – కృష్ణ విజయం”(prema charithra krishna vijayam)హెచ్.మధుసూదన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 3న విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించి సూపర్ స్టార్ కృష్ణ పర్సనల్ మేకప్ మేన్ మాధవరావు, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రత్నమయ్య, ప్రముఖ సాహితీవేత్త – గీత రచయిత బిక్కి కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాదర్ గోరి, ప్రముఖ చిత్రకారిణి శ్రీమతి వాసిరెడ్డి స్పందన, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ, దర్శకనిర్మాత హెచ్.మధుసూదన్, సహనిర్మాత ఎం. శంకర్ లు పాల్గొని “ప్రేమచరిత్ర – కృష్ణ విజయం”కృష్ణ నటించిన చివరి చిత్రంగా చరిత్ర నిలిచిపోతుందని, కృష్ణను అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ మహిళలను చూడాలని, కృష్ణకు సంక్రాంతితో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.
దర్శకనిర్మాత మధుసూదన్ మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణతో సినిమా రూపొందించడం తన అదృష్టంగా భావించానని, ఆయన నటించిన ఆఖరి చిత్రం విడుదలైన చిత్రాల జాబితాలో ఉండకూడదనే పట్టుదలతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
అంబుజా మూవీస్, రామ్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై దర్శకుడు మధుసూదన్ నే నిర్మించగా యశ్వంత్, సుహాసిని జంటగా నటించగా నాగబాబు, ఆలీ నటించిన ముఖ్యపాత్రలు పోషించారు.ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం సమకూర్చగా పబ్లిసిటీ డివైడ్ శ్రీకాంత్, పి.ఆర్.ఓ ధీరజ్-అప్పాజీ, సహ నిర్మాతలు; బండ్రి నాగరాజ్ గుప్తా, బి.వెంకటేష్ శెట్టి, శ్రీపాద హన్ చాటే, ఎం.శంకర్.