తిరుపతి కి చెందిన కౌశిక్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)అంటే చాలా ఇష్టం.ఎన్టీఆర్ సినిమాలన్నీ క్రమం తప్పకుండా చూస్తుంటాడు.దేవర రిలీజ్ టైంలో క్యాన్సర్ బారిన పడి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.తన చివరి కోరిక దేవర సినిమా చూసి చనిపోవడం అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేసాడు.దీంతో విషయం ఎన్టీఆర్ కి తెలియడంతో కౌశిక్ తో వీడియో కాల్ లో మాట్లాడటమే కాకుండా తన వైద్యానికి అయ్యే ఖర్చుని చూసుకుంటానని ఎన్టీఆర్ హామీ ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం ఎన్టీఆర్ కౌశిక్ హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టడం జరిగింది. కానీ ఈ విషయం తెలుసుకోకుండా నిన్నటి నుంచి సోషల్ మీడియా, కొన్ని ఛానల్స్ లో ఎన్టీఆర్ ని నిందిస్తూ
రకరకాల వార్తలు, పోస్టులు చెయ్యడం జరిగింది. దీంతో ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో అసలు నిజాలు తెలుసుకుని ప్రచారం చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.తన టీం తో అభిమాని యోగక్షేమాలు తెలుసుకొని దగ్గరుండి మరి ఎన్టీఆర్ డిశ్చార్జ్ చేయించాడు.
రీసెంట్ గా కౌశిక్ తల్లి మీడియాతో మాట్లాడుతున్న ఎన్టీఆర్ నుంచి ఇంతవరకు ఎలాంటి సాయం అందలేదు అని చెప్పింది. కానీ ఈ విషయంలో మిస్ కమ్యూనికేషన్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.కౌశిక్ తో ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఎన్టీఆర్ రెండున్నర లక్షలు.సిఎం సహాయనిధి నుంచి 11 లక్షలు, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి 40 లక్షలు ఇచ్చారు.ఇప్పుడు మిగిలిన ఫ్యాన్స్ ని ఎన్టీఆర్ కట్టడంతో కౌశిక్ హాస్పిటల్ నుంచి డీఛార్జ్ అయ్యాడు.