పుష్ప 2(పుష్ప 2)బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం,ఆమె కుమారుడు శ్రీ తేజ్ హాస్పిటల్ లో ఉన్న విషయంపై అల్లు అర్జున్ పై కేసు నమోదు కాగా,మూడు వారాల కండిషన్ బెయిల్ పై అల్లు అర్జున్ బయట ఉన్న విషయం తెలిసిందే.
ఈ కేసులో అల్లు అర్జున్ కి బిఎన్ఎస్ సెక్షన్ 35 (3 ) కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు అల్లు అర్జున్ ని విచారణకి పిలవడం జరిగింది.దీంతో అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చారు.ఆయన వెంట మా చంద్రమయ్య రెడ్డి,తండ్రి అల్లు అరవింద్ కూడా వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన గురించి మరిన్ని వివరాలను పోలీసులు అడిగి తెలుసుకుంటారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ స్టేట్ మెంట్ ని కూడా రికార్డు చేయనున్నారు.అల్లు అర్జున్ రాకతో చిక్కడపల్లి పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది.ఇక అల్లు అర్జున్ ఈ కేసులో ఏ 11గా ఉన్నాడు.