ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(పుష్ప 2)వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 5 న రిలీజయ్యి ఇప్పుడు ఇండియాలోనే హయ్యస్ట్ కలెక్షన్స్ ని సాధించే మొట్టమొదటి మూవీగా అడుగులు వెయ్యబోతుంది. ఇప్పటికే 1500 కోట్ల పైన సాధించిన పుష్ప 2 తన సత్తా ఈ పాటిదో చాటి చెప్పింది. అల్లు అర్జున్ రేంజ్ కి ఇది నిదర్శనమని ట్రేడ్ వర్గాల వారు వ్యక్తపరుస్తున్నారు.
ఇక పుష్ప 2 లోని పోలీసులని అవమానించిన కొన్ని సీన్స్ ని తొలగించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(theenmar mallanna)తెలంగాణలోని మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ థియేటర్‌కు వెళ్లి మరి సినిమా చూశాను.సినిమాలో కొన్ని సన్నివేశాలు పోలీసుల పట్ల చిన్నచూపు చూస్తే గంధపు చెక్కల చెక్కల రూపంలో స్మగ్లర్ కొట్టారు. పెద్ద హీరోగా వచ్చి పోలీస్ ఆఫీసర్ కారును ఢీ కొట్టగానే పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్ లో పడిపోతాడు.ఆ తర్వాత ఏకంగా స్విమ్మింగ్ పూల్ లోనే హీరో అల్లు అర్జున్ ఉచ్చ పోయడం అంటే పోలీసులని అవమానించడమే.చట్టరీత్యా ఆ సీన్ కట్ చేసి,డైరెక్టర్ సుకుమార్ ప్రొడ్యూసర్ మరియు అల్లు అర్జున్ పైన చర్యలు తీసుకోవాలి.అసలు ఇలాంటి సన్నివేశాలు ఉన్న సినిమాలకి సెన్సార్ బోర్డు ఎందుకు వస్తుంది! సెన్సార్ బోర్డులో ఏం జరుగుతుంది! ఏం మెసేజ్ ఇస్తున్నారు!
తెలంగాణ ప్రజలకు మరియు భారతదేశ ప్రజలకు స్మగ్లర్లే హీరోలాగా చూపిస్తే నేటి యువత అదే మార్గంలో చెడు మార్గంలో వెళ్తే ఇది సమాజాన్ని నాశనం చేయడం కాదా. ఇటువంటి సినిమాలను ప్రోత్సహించకుండా మంచి సినిమాలను ప్రోత్సహించి పదిమందికి ఉపయోగపడే సినిమా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందంటూ మల్లన్న తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరుగుతుంది.