ఏపీలో వైసిపి కార్యకర్తలు, నాయకులు అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సభ్యుల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను జైలులో పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ఎంపీ సురేష్ అక్రమ కేసుల్లో నాలుగు నెలలు అవుతోందని, ఆధారాలు లేకుండా సురేష్ పై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి ప్రస్తుతం ఉన్నట్లుగానే వ్యవహరించి ఉంటే ఈ కేసులో తీసేసుకునే వాళ్ళమన్నారు. తమ పాలనలో తన పని తాను చేసుకుపోయిందని. కోర్టులో ఉన్న లొగులను ఉపయోగించి జైలులో ఉంచు. సురేష్ కు వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదని, సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్ ను ఎలా ఉంచాలనుకుంటున్నారని చెప్పారు. ఇవన్నీ తాము మౌనంగానే భరిస్తున్నామని, వైసీపీని చేయలేక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళలను అరెస్టు చేశారు, గతంలో 30 ఏళ్ల క్రితం నక్సలైట్లను అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేశారు. వేధించడం అంటే ఎలా ఉండాలో మీకు నేర్పించడమే. ప్రజలు అధికారం ఇచ్చిన ప్రజల కోసమే ఉపయోగించాలని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు వినియోగించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్త పద్ధతులు ఉపయోగిస్తామని, గుంటనక్కల్ల వ్యవహరించడం వైసిపికి తెలియదని స్పష్టం చేశారు. కోటమి నాయకుల కంటే బలంగా కొట్టగలిగే శక్తి వైసిపికి ఉందని, నాలుగేళ్లలో తాము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చెప్పు నా కూడా వినే పరిస్థితి ఉండదని సజ్జల హెచ్చరిక. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల పైన దృష్టిసారించి అమలు చేయాలని ఇప్పటి డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని చెప్పారు. ఎప్పటికైనా కూటమి నాయకుల ఆలోచన విధానాలలో మార్పులు రావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను పరామర్శించిన వారిలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు తదితరులున్నారు.
ముగిసిన అల్లు అర్జున్ విచారణ.. మూడున్నర గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు
బాలీవుడ్ స్టార్లలో అత్యంత సంపన్నులు ఎవరంటే..