- వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు
ముద్రణ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగర సమీపంలోని చెరువుల ఆక్రమణలపై అధికారులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు చేరువులో ఉన్న పలు చెరువులను క్షేత్రస్థాయిలో రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువుల దాడులపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. చెరువులలో మట్టిపోయడంతో పాటు ఆఖరుకు వరద కాలువలను కూడా కనిపించకుండా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. నానక్ రామ్ గూడకు చేరువులో ఉన్న తౌతానికుంట, భగీరథమ్మ చెరువు, నార్సింగ్‌లోని నెక్నాంపూర్ చెరువుల ఆక్రమణపై అధికారులపై కమిషనర్ రంగనాథ్ సీరియస్ అయ్యారు.
తౌతాని కుంట, భగీరథమ్మ చెరువుల ఆక్రమణలతో పాటు ఆయా చెరువుల్లోకి వరద నీరు చేరకుండా కాలువలను మళ్ళించడం, పట్టడంపై ఇరిగేషన్, జీహెచ్‌సీ, హెచ్ఎండీ అధికారులతో క్షుణ్ణంగా అధికారులతో క్షుణ్ణంగా ఫిర్యాదు చేశారు. కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ మ్యాప్‌లతో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ విభాగాలకు చెందిన మ్యాప్‌లతో పూర్తి స్థాయిలో పరిశీలన జరిపించి వారం రోజుల లోపు నివేదిక సమర్పించాలని అధికారులకు ఆయన సూచించారు. ఇదిలావుండగా, చెరువులను ఆనుకుని ఉన్న స్థలాలు తమవంటూ పలువురు కమిషనర్ రంగనాథ్ ను కలువగా.. పూర్తి వివరాలను హైడ్రాకు సమర్పిస్తే, క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.