Home సినిమా స్టార్ హీరోలకు కోలుకోలేని దెబ్బ.. ఇక తెలుగు సినిమా మనుగడ కష్టమే! – Sneha News

స్టార్ హీరోలకు కోలుకోలేని దెబ్బ.. ఇక తెలుగు సినిమా మనుగడ కష్టమే! – Sneha News

by Sneha News
0 comments
స్టార్ హీరోలకు కోలుకోలేని దెబ్బ.. ఇక తెలుగు సినిమా మనుగడ కష్టమే!


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా తన స్టామినా ఏమిటో చూపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇండియాలోనే నెంబర్‌ వన్ ఇండస్ట్రీగా టాలీవుడ్ అవతరించింది. గత ఐదేళ్ళలో సౌత్ సినిమాకి ఎంతో ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా కలెక్షన్లపరంగా రికార్డులు సృష్టించిన సినిమాలు తెలుగు నుంచే రావడంతో అందరి దృష్టీ ఇప్పుడు టాలీవుడ్‌పైనే ఉంది. మన హీరోలంతా ఒకరిని రికార్డును మరొకరు అధిగమించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్‌బస్టర్‌ చెయ్యాలని కష్టపడుతున్నారు. తొలివారంలోనే అంతా రాబట్టవచ్చు అనే ఉద్దేశంతో నిర్మాతలు కూడా బడ్జెట్‌ ఎంతైనా వెనుకాడడం లేదు. దీనంతటికీ కారణం మొదటి వారం టికెట్‌ రేట్లను పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వాలు ఇవ్వడమే. అదనంగా, ప్రీమియర్‌ షోలకు అనుమతులు ఇవ్వడం, ఆ టికెట్‌ రేట్లను కూడా భారీగా పెంచుకునే అవకాశం కల్పించడంతో తమ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేసి కలెక్షన్లు దండుకోవడానికి అలవాటు పడ్డారు.

ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇక తెలుగు సినిమా మనుగడ కష్టమేనని అర్థమవుతోంది. ఎందుకంటే తెలుగు సినిమా ఖ్యాతిని దేశ విదేశాల్లో విస్తరింపజేసినవారు ఖచ్చితంగా టాలీవుడ్‌లోని టాప్ హీరోలు, టాప్ డైరెక్టర్లు. వాళ్ళు చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీసే. ఈ బడ్జెట్ విషయంలో ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా చాలా రిచ్‌గా సినిమాలు తీస్తున్నారు. పుష్ప2 రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటన ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఇప్పటికీ కోలుకోలేకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. శనివారం అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. ఇకపై ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా, తెలుగు సినిమాకి అంత హైప్‌ రాకుండా ఉండేందుకు తెలంగాణ సర్కార్‌ టికెట్‌ రేట్స్‌ పెంపు, బెనిఫిట్‌ షోలపై నిషేధం విధించింది.

సంక్రాంతి కానుకగా విడుదల కానున్న రామ్‌చరణ్‌ లేటెస్ట్‌ మూవీ గేమ్‌ ఛేంజర్‌ చిత్రం ఇప్పుడు కష్టాల్లో పడుతోంది. ఇప్పటికే ఈ సినిమా మూడేళ్ళుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. బడ్జెట్‌ పరంగా నిర్మాత దిల్‌రాజుకు భారంగా మారిన ఈ చిత్రానికి పుష్ప2 తరహాలోనే ప్రమోషన్స్‌తో హైప్‌ తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం వల్ల గేమ్‌ ఛేంజర్‌కి పెద్ద షాక్‌ తగిలింది. నిర్మాత దిల్‌రాజును తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా నియమించింది తెలంగాణ సర్కార్‌. పదవీ బాధ్యతలు మాట్లాడుతూ టికెట్ తర్వాత తీసుకున్న దిల్ రాజుల రేట్ల హైప్, బెనిఫిట్ షోలు తమ సినిమాకి యధావిధిగా ఉంటాయని ప్రకటించారు. శనివారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనతో గేమ్‌ ఛేంజర్‌కి షాక్‌ తగిలింది. ఈ రోజుల్లో సినిమా ఒక్కటే కాదు, రాబోయే టాప్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీ కావడంతో అన్నింటిపైనా ఈ ప్రభావం పడుతుంది. దీన్నిబట్టి ఇకపై మన హీరోల రికార్డుల వేటకు బ్రేక్‌ పడినట్టే అని అర్థమవుతోంది. మరి ఈ సమస్య నుంచి తెలుగు సినిమా ఎలా గట్టెక్కిస్తారో చూడాలి.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech