ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలో (తిరుమలయ్య గుట్ట) ఉన్న రేడియంట్ హైస్కూల్ లో శనివారం విద్యుత్ షాక్ తో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి హరీష్ రావు (13)మృతి చెందాడు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దమడూరు గ్రామానికి చెందిన భాస్కర రావు కుమార హరీష్ రావు వనపర్తి జిల్లా జోన్లోని రేడియంట్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు.
శనివారం ఉదయం ఎప్పటిలాగే కాలకృత్యాలు తీర్చుకోవడానికి లేచిన ఆ విద్యార్థి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి బహిర్ భూమికని వెళ్లి అక్కడ అడవి పందుల కోసం రైతు వేసిన విద్యుత్ కంచ తగలడంతో అక్కడికక్కడే పడిపోయాడు. ఆ విద్యార్థిని వెంటే ఉన్న మరో విద్యార్థి పాఠశాలకు చేరుకొని పరిశీలించడంతో విద్యుత్ షాక్తో గాయపడిన విద్యార్థిని వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది. తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని కన్నీరు మునిరయ్యారు. విద్యార్థికి పాఠశాల యాజమాన్యమే కారణమని, హాస్టల్లో ఉన్న విద్యార్థి బయటకు వెళ్తుంటే వార్డెన్ ఎందుకు మృతి చెందలేదని వారు ప్రశ్నించారు. విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున చేరుకొని పాఠశాల ముందు ఆందోళన నిర్వహించారు. ఆర్థిక సహాయం చేసే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.