2
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది , పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రపతి ముర్ము ఈ నెల 17న హైదరాబాదుకు చేరుకున్నారు. ఈ 5 రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ పనులు, సాంస్కృతిక కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఈ పర్యటన ముగించుకుని శనివారం హకింపేట ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మేడ్చెల్ -మల్కాజగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ , ఇతర అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.