ముద్ర, తెలంగాణ బ్యూరో : రవాణా శాఖలో డి టి సి లు, జె టి సి లు గా పదోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగ్ లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జైంట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లు గా పదోన్నతి పొందిన మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ కు విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్, ఐ.టి జైంట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా, శివలింగయ్య కు అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్ , జైంట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా పోస్టింగ్ లు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లు లు గా పదోన్నతులు పొందిన రవీందర్ కుమార్ ను అదిలాబాద్ డి టీ సి గా, ఎన్. వాణి ని నల్గొండ డి టి సి గా, ఆఫ్రీన్ సిద్దిఖీ ని కమిషనర్ కార్యాలయంలో డి టి సి గా , కిషన్ ను మహబూబ్ నగర్ డి టి సి గా , సదానందం ను రంగారెడ్డి డిటిసి గా పోస్టింగ్ లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.