- అబద్దాల్లో బీఆర్ఎస్ రికార్డ్
- మేము ఇప్పటివరకు రూ.26,298 కోట్లు వడ్డీ కట్టినం
ముద్ర, తెలంగాణ బ్యూరో : అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్ పార్టీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. గురువారం అసెంబ్లీలో రాష్ట్ర అప్పులు, వాటి చెల్లింపులపై మాట్లాడిన ఆయన… తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామని ప్రకటించారు. రాష్ట్రం మొత్తం అప్పు రూ.6.71 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పారు. అప్పులపై హరీష్‌రావు అనేక ఆరోపణలు చేశారు.
బీఆర్‌ఎస్ నేతల పెండింగ్ బిల్లు రూ.40,150 కోట్లు ఉన్నాయని, అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపితే రూ.7లక్షల 19వేల కోట్ల అప్పు. తా ము అధికారంలోకి వచ్చాక రూ.52 వేల కోట్లు అప్పు చేశామన్నారు.అప్పులు దాచి కొత్త అప్పులు తీసుకునే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదన్న భట్టి ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకువెళ్తున్నామన్నారు. ప్రజల డబ్బును ఖర్చు పెడుతున్నప్పుడు జవాబుదారీతనంతో ఉండాల్సిన అవసరం లేదు కానీ గత ప్రభుత్వం దీనికి విరుద్ధంగా వ్యవహరించింది.
గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన రూ.7 లక్షల కోట్లు అప్పులేనిదన్న డిప్యూటీ సీఎం. ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని గొప్పగా చెప్పారు ఆ సంస్థలకు బిల్లులు చెల్లించలేదని.తమ ప్రభుత్వం వడ్డీలు, అప్పుల పేరుతో రూ.12,117 కోట్లు కట్టింది. ఉద్యోగస్థులకు మార్చి నుంచి ఇప్పటివరకు మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం 2018-23 వరకు రుణమాఫీ ఇవ్వకుండా వదిలేసిందన్న భట్టి.. తాము రూ.20,617 కోట్ల పంట రుణాలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ఇప్తున్నామనీ, గురుకులాల్లో డైట్ మీల్స్‌ను పెంచామన్నారు.
మహిళల కోసం మహాలక్ష్మి పథకం అమలులో వివరించబడింది. బీఆర్‌ఎస్ నేతలతోపాటు తాము ప్రభుత్వం ఆస్తులను అమ్ముకోలేదని చురకలంటించారు. విమానాశ్రయం, ఓఆర్ఆర్ లీజుకు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఏ ఆస్తులను అమ్మకుండానే హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. పెండింగ్ బిల్లులు, బకాయిలను క్లియర్ చేసుకుంటూ వస్తున్నామని చెప్పారు. పదేళ్ల పాటు స్కూళ్లలో డైట్ బిల్లులు కూడా పెంచలేదు. తాము డైట్ బిల్లు పెంచామని.. యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.తప్పుడు లెక్కలు చెప్పి సభను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఏంటోందని.. సభలోనే కాదు బయట కూడా ఏది పడితే అది మాట్లాడాలని ధ్వజమెత్తారు.