Home సినిమా శివరాజ్ కుమార్ కి అమెరికాలో సర్జరీ..అందరిలో టెన్షన్ – Sneha News

శివరాజ్ కుమార్ కి అమెరికాలో సర్జరీ..అందరిలో టెన్షన్ – Sneha News

by Sneha News
0 comments
శివరాజ్ కుమార్ కి అమెరికాలో సర్జరీ..అందరిలో టెన్షన్


కన్నడ స్టార్ హీరో శివరాజ్(శివ రాజ్ కుమార్)కుమార్ రీసెంట్ గా ‘రతి రణగల్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.తెలుగులో కూడా అదే పేరుతో విడుదలై మంచి ప్రేక్షకాదరణని సొంతం చేసుకుంది.ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శివ రాజ్ కుమార్ మాట్లాడడంతో నాకు ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. ఫస్ట్ టైం తెలిసినప్పడు షాక్ అయ్యాను.కానీ ఇప్పుడు దైర్యంగా ఉన్నాను ఎవరు ఆందోళన చెందవద్దు.అందుకు సంబంధించిన ట్రీట్ మెంట్ ని కూడా తీసుకుంటున్నానని చెప్పడం జరిగింది.

రీసెంట్ గా అందుకు సంబంధించిన సర్గరీ చేయించుకోవడానికి శివ రాజ్ కుమార్ అమెరికా బయలుదేరాడు.ఈ సందర్భంగా బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతు ఈ నెల 24న సర్గరీ జరగనుంది.సాధారణంగా నేను చాలా ధైర్యంగా ఉంటాను.కానీ సర్జరీ కోసం వెళ్తున్నప్పుడు నా కుటుంబ సభ్యులను,సన్నిహితులను,అభిమానులను చూసినప్పుడు కొంచం భావోద్వేగానికి లోనయ్యాను. చేసిన తర్వాత యుఐ,మాక్స్ సినిమాలు చూస్తానని చెప్పుకొచ్చాడు.

ఇక శివరాజ్ కుమార్ అమెరికా వెళ్లనున్నాడని తెలియడంతో పాటు సినీ నటులు, దర్శకులు,అభిమానులు ఆయన నివాసానికి చేరుకొని ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది.అమెరికా బయలు దేరే ముందు శివరాజ్ కుమార్ ఇంట్లో పెద్ద ఎత్తున పూజ కార్యక్రమం కూడా జరిగింది. అభిమానులు కూడా తమ అభిమాన నటుడు శివన్నఅమెరికా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవాలయాల్లో,మసీదుల్లో, చర్చిల్లో పూజలు నిర్వహిస్తున్నారు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech