27
గురుకులాలలో రోజుకు ఒక ఘటనతో అందరినీ కలవర పెడుతోంది. ఒక ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంటోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో పాముకాటు ఘటన కలకలం రేపుతోంది. మెట్పల్లి మండలం పెద్దాపూర్‌లో ఉన్న గురుకుల పాఠశాల వరుస పాముకాట్లు కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్ధులను పాము కరించింది.
ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్ధి ఓంకార్‌ను నిన్న పాము కరిచింది. ఓంకార్ చికిత్స తీసుకున్నాడు. ఈ ఘటన మరవక ముందే.. మరో విద్యార్ధి యశ్వంత్‌ని పాము కరిచింది. యశ్వంత్‌ను కోరుట్ల ఆసుపత్రికి. గతంలో ఇదే గురుకులంలో పాము కాటుతో ఇద్దరు విద్యార్ధులు మృతి చెందారు. ఈ గురుకుల పాఠశాలలో వరుస పాముకాటు ఘటనలతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.