స్టార్ హీరోయిన్ నయనతార(nayanthara)భర్త విగ్నేష్ శివన్(vignesh shivan)కి దర్శకుడిగా తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది.విజయ్ సేతుపతి తో ‘నానుమ్ రౌడీ దాన్’,’కాతు వాకుల రెండు కాదల్’,సూర్యతో ‘తానా సెర్దినా కొట్టం, సాయిపల్లవి,అంజలి,సిమ్రాన్ ప్రధాన పాత్రలు. పాత్రల్లో ‘పావాకడైగళ్’ అనే చిత్రాలని తెరకెక్కించాడు.కొన్ని రోజుల క్రితం ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు అజిత్(ajith kumar)సార్ హీరోగా వచ్చిన’ఎన్నై అరిందాల్’ కి ఒక పాట రాసాను.అంటే కాదు నా సినిమా’నానుమ్ రౌడీ దాన్’ ని మెచ్చుకున్నారని చెప్పుకొచ్చాడు.దీంతో ‘ఎన్నై అరిందాల్’ 2015 లో వచ్చింది,నానుమ్ రౌడీ దాన్ 2017 లో వస్తే ఎలా మెచ్చుకుంటారు. అంటూ నెటిజన్లు ట్రోల్స్ చెయ్యడం మొదలు పెట్టారు.
ఇప్పుడు ఈ ట్రోల్ల్స్ పై విగ్నేష్ స్పందిస్తూ ‘ఎన్నై అరిందాల్’ నుంచి నాకు అజిత్ తెలుసు. ఆ సినిమా దర్శకుడు గౌతమ్ వాసుదేవమీనన్ ఒక పాట రాయమని అడిగితే రాసిచ్చా.ఆ తర్వాత అజిత్ సార్ తో పరిచయం ఏర్పడింది.ఆ తర్వాత ‘విశ్వాసం’ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నప్పుడు అజిత్ సార్ ని కలిసాను.అప్పుడు ఆయన నాతో ‘నానుమ్ రౌడీ దాన్ చూశానని’ నాకు బాగా నచ్చిందని చెప్పారు.
మొన్న జరిగిన ఇంటర్వ్యూ లో పూర్తి విషయాన్నీవివరించి చెప్పలేకపోయాను.పెద్ద వాళ్ల గురించి చెప్తున్నప్పుడు ప్రతి విషయాన్నీ పూర్తిగా చెప్పలేం.అది తెలియకుండా నేను అబద్దం చెప్తున్నట్టు ట్రోల్స్ చేస్తున్నారు.ఇక నైనా ట్రోల్స్ ని ఆపాలని సోషల్ మీడియా వేదికగా తెలియచేసాడు. విశ్వాసం మూవీ 2019 లో విడుదలవ్వగా అజిత్ సరసన నయనతార నటించింది.