Home సినిమా పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ భేటీ!శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఏంటి – Sneha News

పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ భేటీ!శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఏంటి – Sneha News

by Sneha News
0 comments
పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ భేటీ!శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఏంటి


ప్రముఖ హీరో అల్లు అర్జున్(allu arjun)హైదరాబాద్ సంధ్యా థియేటర్ లో సంభవించిన మహిళ మృతి కేసులో ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న విషయం తెలిసిందే.ఇక జైలు నుంచి అల్లు అర్జున్ బయటకి రాగానే చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ ని కలిసిన విషయం తెలిసిందే.ఆ తర్వాత అల్లు అర్జున్ స్వయంగా చిరంజీవి ,నాగబాబు నివాసానికి వెళ్లి కేసు విషయంతో పాటు మహిళ మృతి,బాబు ఆరోగ్యం గురించి చర్చ జరిగింది.

ఇక ఆ టైంలోనే పవన్ కళ్యాణ్(pawan kalyan)ని కూడా అల్లు అర్జున్ కలవబోతున్నాడని వార్తలు వచ్చాయి.నిజానికి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు రాత్రే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చాడు. కానీ ఆ మరుసటి రోజే ప్రభుత్వ కార్యక్రమం కారణంగా పవన్ ఏపికి వెళ్ళిపోయాడు.దీంతో అల్లు అర్జునే ఏపీకి వెళ్తాడని ప్రచారం జరిగింది.కానీ ఇప్పుడు పవన్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరాడని తెలుస్తుంది. హైదరాబాద్ రాగానే నేరుగా తన ఇంటికి పవన్ వెళ్తాడని, అల్లు అర్జున్ కూడా పవన్ దగ్గరకి వెళ్లబోతున్నాడని అంటున్నారు.దీంతో పవన్, అల్లు అర్జున్ భేటీ పై ఇరువురి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది.సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీ తేజ్ హాస్పిటల్ లో ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech