పుష్ప2 విడుదల సందర్భంగా ప్రీమియర్ షోలో విషాద ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు 9 ఏళ్ల శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. గత 11 రోజులుగా అతనికి చికిత్స అందించారు. నాలుగు రోజుల క్రితం అతని పరిస్థితి మెరుగుపడుతోందని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా కిమ్స్ ఆసుపత్రి ఆసుపత్రికి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అతను కోమాలోనే ఉన్నాడని, పైప్ ద్వారా లిక్విడ్ రూపంలో ఆహారాన్ని అందిస్తామని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ట్రీట్మెంట్కి అతను స్పందించడం లేదని, తమ ప్రయత్నం చేస్తున్నామని, దేవుడిపైనే భారం అని డాక్టర్లు చెప్పడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. శ్రీతేజ్ కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు.