బిగ్‌బాస్ సీజన్ 8కి సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ ఆదివారం టెలికాస్ట్ కాబోతోంది. ఆల్రెడీ టాప్ 5లోని ఇద్దరిని ఎలిమినేట్ ప్రదర్శించినట్లు. ఇక ఫైనల్ విన్నర్ ఎవరు అనేది తేలాల్సి ఉంది. గత సీజన్‌లో విన్నర్ ఎవరు అనేది ముందుగానే అందరికీ తెలిసిపోయింది. అయితే ఈసారి అలా జరగకుండా, విన్నర్ ఎవరు అనేది లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫైనల్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. ఫైనల్ ఎపిసోడ్ కోసం బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ఐదుగురే కాకుండా ఎక్స్ హౌస్‌మేట్స్ కూడా అటెండ్ అయ్యారు.
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్ ప్రసారాన్ని పురస్కరించుకొని పోలీసు శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. గత సీజన్‌లో పల్లవి ప్రశాంత్ విషయంలో జరిగిన రాద్ధాంతం ఈసారి జరగాల్సిన ఉద్దేశంతో కొన్ని కఠినమైన ట్రాఫిక్‌కూడదని రూల్స్ పెట్టారు. అంతేకాదు, పుష్ప2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన విషాద ఘటనను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఇందిరా నగర్, కృష్ణానగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వద్దకు వెళ్ళే దారిలో ఆంక్షలు విధించారు. అన్నపూర్ణ స్టూడియో సమీపంలో బారీకేడ్లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను వెస్ట్ జోన్ డిసిపి విజయ్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు. గత సీజన్‌లో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పోలీసులు బిగ్‌బాస్ నిర్వాహకులకు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. తమవైపు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, దాన్ని మించి ఎలాంటి న్యూసెన్స్ జరిగినా బిగ్‌బాస్ నిర్వాహకుల బాధ్యత ఉందని తెలిపారు. మరి బిగ్‌బాస్ సీజన్ 8 విన్నర్‌ని ఎనౌన్స్ చేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.