తన కుటుంబానికి చెందిన పర్సనల్ విషయాల్లో మీడియా ఎంటర్ అయినందుకు మోహన్ బాబు(మోహన్ బాబు)ఒక మీడియా పర్సన్ పై దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే.దీంతో ఈ సంఘటనపై మీడియా సంఘాలు మోహన్ బాబుపై పలుచోట్ల పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు క్షమాపణలు చెప్పాలని కూడా కోరడం జరిగింది.
దీంతో రీసెంట్ గా మోహన్ బాబు బహిరంగంగా ఒక లేఖను విడుదల చేస్తూ ‘నా కుటుంబ ఘటన పెద్దదిగా మారడం వల్ల ఆవేశంతో జర్నలిస్ట్ ని గాయపరిచిందనుకుందని చింతిస్తున్నాను. ఘటన నలభై ఎనిమిది గంటలపాటు ఆసుపత్రిలో ఉండటం వల్ల జర్నలిస్ట్ విషయంలో నేను స్పందించలేకపోయాను.నా వల్ల కలిగిన ఇబ్బంది వల్ల జర్నలిస్ట్ కుటుంబానికి, టీవీ9 ఫ్యామిలీకి మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను.
నేను నా ఫ్యామిలీ లో ఏర్పడిన పర్సనల్ విబేధాల వలన చాలా ఆందోళనలో ఉన్నాను.కొంత మంది నా ఫ్యామిలీ ని టార్గెట్. ఆ టైం లో నా గేట్లు బద్దలు కొట్టుకొని ముప్పై నలభై మంది అసాంఘిక శక్తులు వచ్చాయి. వాళ్ళని నియంత్రించే పనిలోనే భాగంగానే అనుకోకుండా దాడి జరిగింది చెప్పాడు.