పుష్ప 2(పుష్ప 2)బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో సంభవించిన మహిళ మరణంపై అల్లు అర్జున్(allu arjun)ని అరెస్ట్ చేసిన సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.ఇక ఈ కేసులో అల్లు అర్జున్ కి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు అల్లు అర్జున్ ని చెంచల్ గూడ జైలుకి తరలించడం జరిగింది. జరుగుతుంది.
దీంతో చంచల్ గూడ జైలు వద్దకు అల్లు అర్జున్ అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. జై బన్నీ అంటూ ఆ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయేలా చేస్తున్నారు. ఇక ముందు జాగ్రత్త చర్యగా కూడా పోలీసులు అభిమానులని అక్కడ నుంచి పంపివేస్తున్నా మళ్ళీ అంతకంతకూ అభిమానులు పెరుగుతూ వస్తుండడంతో ఆ ఏరియా మొత్తం భారీగాట్రాఫిక్ జామ్ అయ్యింది.ఇక అల్లు అర్జున్ తన అభిమానులని ఆర్మీ అని పిలుచుకుంటాడనే విషయం తెలిసిందే.