11
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లడం వలనే తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయిందని,తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ లో అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు,అనంతరం కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ కోసం కోర్టు తీర్పు ఇచ్చింది.దీంతో అల్లు అర్జున్ ని చంచల్ గూడ జైలుకి హాజరుపరిచారు.
ఇక ఈ కేసులో అల్లు అర్జున్ తరఫు లాయర్లు క్యాష్ పిటిషన్ వెయ్యడం జరిగింది.దీంతో అల్లు అర్జున్ కి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.దీంతో మరికాసేపట్లో చంచల్ గూడ జైలు నుండి
అల్లు అర్జున్ విడుదల కానున్నాడు.దీంతో అయన అభిమనుల్లో జోష్ వచ్చినట్లైంది.