సంధ్య థియేటర్‌లో డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. గత పదిరోజులుగా జరుగుతున్న చర్చ. ఆ మహిళ మృతికి అల్లు అర్జునే బాధ్యుడని, అతన్ని అరెస్ట్ చేయాలన్న డిమాండ్‌లు సర్వత్రా వినిపించాయి. ఈ కోరనే శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు జూబ్లీ హిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి తరలించి అతని స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకొని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించబడింది. వైద్య పరీక్షల అనంతరం అతన్ని నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ కోర్టులో జరుగుతోంది. మరో పక్క అల్లు అర్జున్ వేసిన స్క్వాష్ పిటిషన్‌పై కూడా విచారణ జరుగుతోంది. పోలీసుల నివేదిక పరిశీలించిన న్యాయమూర్తి అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. అతను థియేటర్‌కి రావడం వల్లే ఈ దుర్ఘటన కనిపించిన కోర్టు ఆ మహిళ మృతి అతనే కారణమని తెలియజేసింది.
ఇదిలా ఉంటే.. తాజాగా మృతురాలు రేవతి భర్త భాస్కర్.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించారు. తన కొడుకు సినిమా చూడాలని కోరడం వల్లే ఇద్దరు పిల్లలతో కలిసి తను, రేవతి వెళ్ళామని చెప్పారు. అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నారని మీకు తెలీదని, అయినా ఇందులో అతని తప్పేమీ లేదని అన్నారు. అవసరమైతే తాను కేసును వాపస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా భాస్కర్ తెలిపారు. మరి కేసుగానీ, కోర్టుగానీ పోలీసులు ఎలా సూచిస్తుందో చూడాలి.