Home సినిమా త్వరలోనే పెళ్లి, పిల్లలు.. సమంత సంచలన పోస్ట్… – Sneha News

త్వరలోనే పెళ్లి, పిల్లలు.. సమంత సంచలన పోస్ట్… – Sneha News

by Sneha News
0 comments
త్వరలోనే పెళ్లి, పిల్లలు.. సమంత సంచలన పోస్ట్...


స్టార్ హీరోయిన్ సమంత (సమంత) పేరు తరచూ వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది. సినిమాలు చేసినా చేయకపోయినా ఆమెకు సంబంధించిన న్యూస్ రావడం మాత్రం కామన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో సంచలన పోస్ట్ పెట్టింది. సమంత పోస్ట్ ని బట్టి చూస్తే.. 2025లో ఆమె రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా, పిల్లలను కనడానికి కూడా రెడీ అని హింట్ ఇచ్చినట్లుగా ఉంది.

వచ్చే 2025 సంవత్సరం తన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుపుతూ తాజాగా సమంత ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. అందులో కొన్ని ఆసక్తికర పాయింట్లు ఉన్నాయి. “ఏడాదంతా ఉంటాయి. బాగా డబ్బులు సంపాదిస్తారు. వృత్తిపరంగా మెరుగైన ఫలితాలు. ఎన్నో ఏళ్ల నాటి కళలు సాకారమవుతాయి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు” వంటి పాయింట్లు ఉంటాయి. అయితే వీటన్నింటి కంటే కూడా ఒక రెండు పాయింట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అవేంటంటే “ప్రేమించే భాగస్వామి వస్తాడు”, “సంతానానికి అనువైన సమయం” అని రాసి ఉంది. సమంత పెట్టిన పోస్ట్ ని, అందులోని పాయింట్లను బట్టి చూస్తే.. ఆమె 2025లో పెళ్లికి సిద్ధమవుతుందని అనిపిస్తోంది.

దీంతో పాటు, ఇన్ స్టాగ్రామ్ లో మరో పోస్ట్ కూడా పెట్టింది సమంత. అందులో “కొన్ని సంవత్సరాలు మీరు గెలుస్తారు. కొన్ని సంవత్సరాలు మీరు క్యారెక్టర్ ను బిల్డ్ చేసుకుంటారు” అంటూ స్టీవ్ జాబ్స్ చెప్పిన కోట్ ని సమంత పంచుకుంది. “ఇప్పటిదాకా క్యారెక్టర్ బిల్డ్ చేసుకున్నాను, ఇప్పుడు గెలిచే టైం వచ్చింది.” అనే ఉద్దేశంతో సమంత ఈ పోస్ట్ పెట్టినట్లు అనిపిస్తోంది. మరి సమంత కోరుకుంటున్నట్లుగా2025లో ఆమె జీవితంలో సరికొత్త వెలుగులు నిండుతాయేమో చూడాలి.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech