పుష్ప 2(పుష్ప 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ (సంధ్య థియేటర్)లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్న విషయం తెలిసిందే.
రీసెంట్ గా శ్రీతేజ్ ఆరోగ్యం గురించి డాక్టర్లు మాట్లాడుతున్నారు బాబు ఆరోగ్యం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుంది.వెంటిలేటర్ పైనే ఉన్నా ట్యూబ్ ద్వారా ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నాడు.శరీరంలో కుడివైపు స్పర్శ తక్కువగా ఉండటం వల్ల పూర్తి స్పృహ రావడానికి సమయం పడుతుందని వెల్లడించడం జరిగింది.
ఇక శ్రీతేజ్ కి అయ్యే వైద్య ఖర్చులు అల్లు అర్జున్(allu arjun)నే భరిస్తు మెరుగైన వైద్యాన్ని చేయిస్తున్నాడు.జరిగిన సంఘటనపై తన విచారాన్ని వ్యక్తం చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి మొదట విడతగా పాతిక లక్షలు ఇచ్చాడు.