ఇటీవల థియేటర్లలో అడుగుపెట్టిన ‘పుష్ప-2’ సినిమా, బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం, రూ.1000 కోట్లకు చేరువైంది. అయితే ‘పుష్ప-2’తో అల్లు అర్జున్‌ని సంచలనాలు సృష్టిస్తుంటే, ఇతర హీరోల నుంచి కనీస స్పందన లేదు. ఎవరూ బన్నీకి కానీ, పుష్ప-2 టీంకి కానీ సోషల్ మీడియా వేదికగా విశేషాలు చెప్పలేదు. ఇంకా కొందరైతే విష్ చేయకపోగా.. ‘పుష్ప-2’ని టార్గెట్ చేస్తున్నారు. (పుష్ప 2 రూల్)
విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా, ప్రమోషన్స్ పరంగా పుష్ప-2 ఎన్నో సంచలనాలు సృష్టించింది. ముఖ్యంగా బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన ఈవెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఈవెంట్ కి ఏకంగా రెండు లక్షల మంది హాజరవ్వడం అందరినీ ఆశ్చర్యపడేలా చేసింది. అయితే తాజాగా ఈ వేడుకపై హీరో సిద్ధార్థ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. తన తాజా చిత్రం ‘మిస్ యూ’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. పుష్ప-2 పాట్నా ఈవెంట్ ప్రస్తావన వచ్చింది. దీనికి సిద్ధార్థ్ బదులిస్తూ.. “అదంతా మార్కెటింగ్ అంతే. కన్‌స్ట్రక్షన్‌లో జేసీబీలు వర్క్ చేస్తున్నా జనాలు వస్తారు. ఇండియాలో మీటింగ్ లకు జనాలను తీసుకురావడం పెద్ద విషయం కాదు.” అంటూ దారుణ వ్యాఖ్యలు చేశాడు. సిద్ధార్థ్ కామెంట్స్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. “నువ్వేళ్ళి పాట్నాలో ఈవెంట్ పెట్టు.. ఎంతమంది వస్తారో చూద్దాం”, “నార్త్ లో పుష్ప-2 కి వస్తున్న కలెక్షన్స్ చూశావా?.. నీ సినిమా వస్తున్న విషయం, కనీసం సౌత్ లో అయినా తెలుసా?” అంటూ బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఇక సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ సైతం ‘పుష్ప-2’పై ఊహించని కామెంట్స్ చేశారు. తాజాగా ‘హరికథ’ వెబ్‌సైట్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. “ఇప్పుడు కథలు మారిపోయాయి. నిన్న గాక మొన్న చూశాం. వాడెవడో చందనం దొంగ.. వాడు హీరో. ఇప్పుడేసలు హీరో అంటే మీనింగ్ లు మారిపోయాయి.” అని అన్నారు. అయితే రాజేంద్ర ప్రసాద్ అప్పటి హీరో పాత్రలకు, ఇప్పటి హీరోల పాత్రలకు మధ్య వ్యత్యాసాన్ని చెబుతూ అటువంటి కామెంట్స్ చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం ఇలా ప్రత్యేకంగా ‘పుష్ప’ ప్రస్తావన తీసుకురావడం అవసరమా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా, ‘ష్ప-2’ సక్సెస్ ని చూసి విష్ చేయకపోగా.. ఇలా కొందరు హీరోలు టార్గెట్ చేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని అల్లు అర్జున్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.