Home తెలంగాణ యాసంగి (రబి) సీజన్ కు సమయం అవుతున్న రైతన్న – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

యాసంగి (రబి) సీజన్ కు సమయం అవుతున్న రైతన్న – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
యాసంగి (రబి) సీజన్ కు సమయం అవుతున్న రైతన్న - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • విత్తనాలు ,ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో సూచిక బోర్డుల శూన్యం
  • విత్తనాలు పంపిణీ ఎవరికి నచ్చిన ధరకు వారు విక్రయిస్తున్న వైనం
  • తూతూ మంత్రంగా తనకిలు చేస్తున్న అధికారులు
  • జోరుగా సాగుతున్న బయో పురుగు మందుల అమ్మకాలు
  • చోద్యం చూస్తున్న అధికారులు

తుంగతుర్తి ముద్ర:- ఖరీఫ్ సీజన్ పూర్తయి యాసంగి అంటే (రబి) సీజన్ రైతన్నలు నారుమడులు, పొలాలు దున్ని వరి విత్తనాల కోసం విత్తన ,పురుగు మందుల ఉత్పత్తి వద్దకు పరుగులు తీస్తున్నారు .కొంతమంది రైతులు ఇప్పటికే నార్లు పోశారు. మరి కొంతమంది రైతులు వెదజల్లే విధానం , అలాగే డ్రమ్స్ సీడీలతో సాగుకు సిద్ధమవుతున్నారు. ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా వారి విత్తనాల విక్రయాల్లోనే దుకాణదారులు ఎవరికి తోచిన ధరలను అమ్మకం చేస్తున్నారు .ఈ విషయంలో సంబంధిత శాఖ అధికారులు ఇప్పటివరకు ఏ ఏ ధరలకు అమ్ముతున్నారు బోర్డులు కనీసం దుకాణాల్లో ఉన్నాయా లేదా అని చూడలేదు. అందుకు ఉదాహరణ ఉత్పత్తులు, పురుగు మందుల విత్తనాల దుకాణాల్లో వారి వారి ఉత్పత్తులలో విక్రయించే విత్తన రకాల సూచిక బోర్డులు కనిపించిన దాఖలాలు లేవు .

వ్యవసాయ శాఖ అధికారులు ఏడీ ఏ ,ఏవోలు ,ఏఈవోలు గా మూడంచెల అధికార వ్యవస్థలో ఏ ఒక్కరు దుకాణదారుల వద్దకు వెళ్లి సూచికల బోర్డులు పెట్టే ప్రయత్నం చేయలేదని తెలిపారు. దీంతో రైతులు దుకాణదారులను వరి విత్తనాల ధరలు ఎంత అని తెలుసుకొని వారు ఆ విధంగా కొనుగోలు చేయాల్సి వస్తుంది . గతంలో వరి విత్తనాలు నాణ్యత లోపంతో రైతులు మొలకలు రాక నానా ఇబ్బందులు పడ్డ విషయాలు తుంగతుర్తి మండలంలో కోకోల్లలుగా జరిగాయి. అయినా అధికారులు సరైన చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది.విత్తనాల విషయం ఇలా ఉంటే యూరియా, డిఏపిలాంటి ఎరువులను ఎమ్మార్పీ ధరల కన్నా ఎక్కువ విక్రయిస్తున్నట్లు సమాచారం.

రైతులకు ఎంపి ధరలకు బిల్లులు రాసి ఇవ్వడం అదనంగా వసూలు చేసే డబ్బులు ఆఫ్ ద రికార్డుగా వసూలు చేస్తున్నారు. డిఏపీ బస్తా 1400గా యూరియా 300 నుండి 350 వరకు కూడా విక్రయిస్తున్నట్లు సూచిస్తున్నాయి. ఏ ఎరువు ఏ విత్తనాలు ఏ పురుగు మందులు ఎంత ధరలకు విక్రయిస్తున్నారు కనీసం సూచించే సూచిక బోర్డులు పెట్టకుండా అమ్మకాలు చేయడం వెనక మతలబు అధిక ధరలకు విక్రయించడమేనని పలువురు రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. తుంగతుర్తి మండల పరిధిలోని అధికారికి ఏడీఏ గా బాధ్యతలు ఇవ్వడంతో పాటు మిగిలిన మండలాల బాధ్యతలు కూడా చేపట్టాల్సి వచ్చింది .కింద స్థాయిలో ఉన్న ఏఈవోలు నామమాత్రంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే పురుగుమందుల విషయానికి వస్తే అధికంగా బయో మందుల విక్రయాలు తుంగతుర్తి మండలంలో జరుగుతాయని మిర్చి సాగు చేస్తారని రైతులు అంటున్నారు .బయోల వాడకం వల్ల చేలు దెబ్బతింటాయని బ్రాండెడ్ కంపెనీల పురుగుమందుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. బయోల అమ్మక అధికారికంగా చేయవచ్చా? తేల్చాల్సింది వ్యవసాయ శాఖ మాత్రమే దాదాపు ఎక్కువ శాతం మంది దుకాణదారులు బయోల అమ్మకాలతోటే అధిక లాభాలు గడిస్తున్నట్లు .రైతులు పంట పండించి కొద్దిపాటి లాభం పొందితే పురుగు మందులు అమ్మే వారు మాత్రం వేలల్లో లక్షల్లో లాభాలు గడించారని వ్యవసాయ శాఖ అధికారులు తమ ఇష్టానుసారంగా పురుగుమందుల అమ్మకాలు చేస్తున్న వారే లేరని రైతులు అంటున్నారు .

వరి చీరలో కలుపు మందుల విషయానికి వస్తే వివిధ కలవారు మందులు రైతులకు అంటగట్టి ఎకరాకు 4000 రూపాయలకు మందులు విక్రయిస్తున్నట్లు రైతుల పొలంలో ఎన్ని రకాల కలుపులు ఉన్నాయో అన్ని రకాల కలుపు పత్రాలు చెబుతూ ఒకదానికి ఒకటి గట్టి అంట ఇబ్బడి ముబ్బడిగా లాభాలు పొందుతున్నాయి. సంకేతాలు విత్తనాల నుండి ఎరువులు పురుగు మందులు వరకు అన్నింటా రైతు మోసపోతున్నాడు అనేది రైతుల మాట .ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు ప్రతి దుకాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి బయో మందులు అమ్మకాలను అరికట్టి అధిక ధరలకు అమ్మే వారి ఆట కట్టించి ప్రతి దుకాణం ముందు ఆయా పురుగుల మందులకు విత్తనాలు మందుల సూచికలు విధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని యావత్ రైతాంగం కోరింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech