నిన్నటి నుంచి మంచు కుటుంబంలో విభేదాలు హాట్ టాపిక్ గా మారాయి. మోహన్ బాబు యూనివర్సిటీ వాటాల విషయంలో తండ్రి మోహన్ బాబు, సోదరుడు విష్ణుతో.. మనోజ్ కి విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మోహన్ బాబు ఇంట్లో శనివారం రాత్రి చర్చలు జరిపినట్లు సమాచారం. చర్చల సమయంలో మోహన్ బాబు తన అనుచరుడు, యూనివర్సిటీ బాధ్యతలు చూసుకునే వినయ్ అనే వ్యక్తి చేత.. మనోజ్ పై దాడి చేసినట్లుగా చెబుతున్నారు. ఈ విషయంపై మనోజ్ పోలీసులకు సమాచారం అందించాడు. అలాగే గాయాలతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి కూడా వెళ్ళాడు. దీంతో మనోజ్ పై దాడి జరగడం నిజమేనని అందరికీ అర్థమైంది. కాగా ఈ ఘటన సమయంలో మనోజ్ సోదరుడు విష్ణు హైదరాబాద్ లో లేడు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మనోజ్ సోదరి మంచు లక్ష్మిపై పడింది. (మంచు మనోజ్)
మనోజ్ కి, లక్ష్మికి మధ్య ఎంతో అనుబంధముంది. తమ కుటుంబంలో అందరికంటే ఎక్కువగా తన అక్క లక్ష్మితోనే ప్రేమగా ఉంటాడు మనోజ్. నిజానికి ఏవో కారణాల వల్ల మనోజ్ చాలాకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. కానీ అక్కకి ఎప్పుడూ దూరం కాలేదు. మౌనికతో మనోజ్ పెళ్లి సమయంలోనూ.. లక్ష్మి తప్ప మంచు కుటుంబమంతా అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. ఆ టైంలో పెళ్లి పెద్దగా తానై మనోజ్-మౌనిక వివాహం జరిపించింది. అలాంటి లక్ష్మి.. ఇప్పుడు ఈ సమయంలో మనోజ్ కి అండగా నిలబడటమే కాకుండా, సమస్య పరిష్కరానికి ప్రయత్నిస్తుంది అనడంలో సందేహం లేదు. లక్ష్మి కూడా అదే ప్రయత్నం చేసింది. కానీ తన వల్ల కూడా కా.. చివరికి చేతులెత్తేసింది. (మంచు లక్ష్మి)
మంచు లక్ష్మి ప్రస్తుతం ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది. అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుంది. ప్రస్తుతం కుటుంబంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లక్ష్మి హైదరాబాద్ లోనే పరిస్థితులు చక్కబెట్టాల్సి ఉంది. ఎందుకంటే మనోజ్ తో అక్కడితోనే కాదు.. తండ్రి మోహన్ బాబు, మరో సోదరుడు విష్ణుతోనూ లక్ష్మి మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. దాంతో అందరికీ వారధిగా నిలబడి, కుటుంబ పరిస్థితులు చక్కదిద్దాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. కానీ లక్ష్మి మాత్రం అందుకు భిన్నంగా.. “బై హైదరాబాద్” అంటూ ఎయిర్ పోర్ట్ ఉన్న వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో కుటుంబంలో గొడవలకు భయపడి లక్ష్మి పారిపోతుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అది పారిపోవడం కాదని, తప్పనిసరి పరిస్థితులలో వెళ్తోందని. ఓ వైపు తండ్రి, మరోవైపు సోదరుడు.. ఇద్దరికీ ఎంత చెప్పి చూసినా ఉపయోగం లేకపోవడంతో.. ప్రస్తుతం ఈ గొడవలకు, హైదరాబాద్ కి దూరంగా వెళ్లాలని లక్ష్మి నిర్ణయించుకుందని సమాచారం.