- పుష్పగాడి దెబ్బకు బెనిఫిట్ షోలు రద్దు
- మంత్రి వెంకట్ రెడ్డి
- అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం మరో ఫిర్యాదు
ముద్ర, సినిమా ప్రతినిధి: పుష్ప–2 సినిమా మొత్తం వివాదం చుట్టూ తిరుగుతోంది. ఈ సినిమా విడుదల పుణ్యమాని.. ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు బ్రేక్ పడింది. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమంటూ సినిమాటోగ్రఫీ మంత్రి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఇదే సమయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. ఇప్పటికే అల్లు అర్జున్ పై కేసు నమోదు కాగా.. ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ వికారాబాద్ ఎస్పీకి మరో పిటిషన్ అందింది.
చుట్టూరా వివాదాలు
పుష్ప -2 విడుదల వేళ చోటు చేసుకున్న ఘటనల పైన వరుస ఫిర్యాదులు నమోదు అవుతు న్నాయి. పుష్ప -2 విడుదల సమయం నుంచి అల్లు అర్జున్ టీం సంబురాలు ఎలా ఉన్నా.. వివాదాలు మాత్రం పెరుగుతున్నాయి. ఈ సినిమా ప్రీమియర్ షో వేళ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ పేరు చేర్చారు. ఈ ఘటన పైన మూవీ మేకర్స్ మైత్రి సంస్థ స్పందించింది. ఇప్పుడు ఈ అంశం ఢిల్లీకి చేరింది. దీంతో, ఇప్పుడు మూవీ మేకర్స్.. అల్లు అర్జున్ ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది.
పుష్ప– -2 ప్రీమియర్ షో వేళ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మృతి చెందారు. ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. అనుమతి లేకుండా ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు ధియేటర్ పైన ఇప్పటికే కేసు నమోదైంది. కాగా, సైతం ధియేటర్ నుంచి పోలీసులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తేల్చారు. ప్రముఖులు ధియేటర్ కు వస్తున్నట్లు ముందస్తు సమాచారం లేదని చెప్పారు. దీంతో, ధియేటర్ తో పాటుగా అల్లు అర్జున్, వ్యక్తిగత సిబ్బంది పైనా కేసు నమోదు చేశారు.
బెనిఫిట్ షోలు రద్దు
పుష్ప సినిమా బెనిఫిట్ షో తెలుగు చిత్ర పరిశ్రమకు మరో బ్రేక్ ఇచ్చింది. ఒకరి మృతికి కారణమైన బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని మంత్రి వెంకట్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో బాలుడు చావుతో పోరాడుతున్నాడు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇకపై ఏసినిమాకి కూడా బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. బెనిపిట్‌షోలు రద్దు చేస్తున్నట్టు మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.
అయితే, భారీగా జనం వస్తారని తెలిసి కూడా థియేటర్ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపణ ఉంది. ఆ ఒప్పంద బేరేజు వేసుకున్న ప్రభుత్వం ఇకపై ఏ సినిమాకి కూడా బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆనందంతో సినిమా చూసేందుకు వచ్చిన ఫ్యామిలీ విషాదంతో ఇంటికి వెళ్లడం ఆందోళన కలిగించిందని అన్నారు కోమటి రెడ్డి. బెనిఫిట్‌షోలు కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని అందుకే ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇక, ఈ తొక్కిసలాటకు పోలీసులు, అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యమే కారమణని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. ఇంత జనం ఉన్న టైంలో అల్లు అర్జున్ ఎలాంటి అనుమతి లేకుండా థియేటర్లోకి ఎలా పంపిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలు వివరించి ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా పట్టించుకోలేదని అంటున్నారు. ఈ తొక్కిసలాట సమయంలో అక్కడే ఉన్న విజయ్ అనే యువకుడు చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన వాపోతున్నాడు. రాత్రి 9 గంటలకే భారీగా జనం వచ్చారని ఆ పరిసరాల్లో పూర్తిగా బ్లాక్ అయ్యాయని తెలిపారు. వాళ్లను కంట్రోల్ చేయడానికి పోలీసులు కానీ, ఇటు థియేటర్ సిబ్బంది కూడా లేరని వివరించారు.
పరిస్థితి ఇప్పటికే ఊపిరాడకుండా ఉందని అంతలోనే అల్ల అర్జున్ అక్కడకు రావడంతో సిచ్యుయేషన్ పూర్తిగా కంట్రోల్ తప్పిందని విజయ్ వివరించారు. తర్వాత అక్కడకు వచ్చిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం ప్రారంభించారని అన్నారు. క్రిమినల్స్‌ను కొట్టినట్టు కొట్టారని వివరించారు. వాటిని పట్టించుకోకుండా జనం మధ్య నుంచి వెళ్తున్న అల్లు అర్జున్ వాహనాన్ని అభిమానులు వెంబడిస్తున్నారు. ఇదే తొక్కిసలాటకు కారణమై ఉంది. ముందే మేల్కొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. సరైన భద్రతా ఏర్పాట్లు చేయడం వల్లే ఒకరి ప్రాణం పోయిందని మరో బాలుడు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే థియేటర్ల వద్ద ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే ప్రభుత్వం బెనిఫిట్‌షోలకు అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చింది.
ఢిల్లీకి చేరిన పంచాయితీ
ఇదే ఘటన పైన తాజాగా జాతీయ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు నమోదైంది. పిటిషనర్ ఫిర్యాదును మానవ హక్కుల సంఘం విచారణకు స్వీకరించింది. మృతురాలి కుటుంబానికి రూ.5 కోట్లు పరిహారం అందించారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లనే తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిందని ఫిర్యాదులో వివరించారు. థియేటర్ లో సినిమా చూసేందుకు అల్లు అర్జున్ రావటంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ అవసరం రేవతి (35) అనే మహిళ తొక్కిసలాటలో మరణించారని, పిటిషన్లో పేర్కొన్నారు.
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయండి
సినిమాకు వచ్చి ప్రాణాలు తీసుకున్నా హీరో అల్లు అర్జున్‌కి మానవత్వం లేదని, ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ వికారాబాద్ ఎస్పీకి మరో ఫిర్యాదు అందింది. గతంలో బిగ్‌బాస్ షోలో విజయం సాధించి పల్లవి ప్రశాంత్‌కు ఒక న్యాయం, ఇప్పుడు అల్లు అర్జున్‌కు న్యాయంగా పిటిషన్ వేయాలని సూచించారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయాలంటూ ఏఐసీసీ మాజీ సభ్యుడు బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు.
ఆల్రెడీ కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బీఎన్ఎస్ యాక్టీవ్లోని 105,118(1), రెడ్ విట్ 3(5) సెక్షన్ల కింద అల్లు అర్జున్‌తోపాటు థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజరుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు హీరో అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ యాదవ్. అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజరుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంష్ యాదవ్ మీడియాకు.
బుధవారం పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా RTC క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరమని డీసీపీ తెలిపింది. బుధవారం రాత్రి 9.40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షోను సంధ్య థియేటర్ యజమాన్యం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హీరో అల్లు అర్జున్ వస్తున్నారని సమాచారం తెలుసుకున్న అభిమానులు భారీగా తరలివచ్చారని, ప్రేక్షకులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా సఫలం కాలేదని వివరించారు. సినిమా వీక్షించేందుకు అల్లు అర్జున్ రావడంతో పరిస్థితి అదుపు తప్పిందని, ఆయన వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు భారీగా తరలివచ్చారని ప్రేక్షకులతోపాటు సినిమాలో నటించిన కీలక నటులు ప్రీమియర్ షోకు హాజరవుతారని పోలీసులకు రాలేదని డీసీపీ అక్షాంశ్ యాదవ్ చెప్పారు.
థియేటర్ కూడా ఇలాంటి ముందస్తు భద్రతా చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఎంట్రీ ఎగ్జిట్లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని, నటినటులకు కూడా ఎటువంటి ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయలేదని వివరించారు. అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బందిని నెట్టి వేయడంతో పరిస్థితి అదుపు తప్పిందని, అప్పటికే థియేటర్ లోపల ప్రేక్షకులు కిక్కిరిసి ఉన్నారని చెప్పారు. థియేటర్లోని లోయర్ బాల్కనీలోకి అల్లు అర్జున్ లోపలికి వెళ్లారని, ప్రేక్షకులకు మధ్య తోపులాట చేసుకుందని డీసీపీ అక్షాంష్ యాదవ్ అన్నారు. ఈ నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఉన్నారని, అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నారని వారికి ఊపిరాడలేదని తెలిపారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.