అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఈ రోజు వరల్డ్ వైడ్ గా విడుదలవ్వగా నిన్న అభిమానుల కోసం బెనిఫిట్ షో వెయ్యడం జరిగింది.అల్లు అర్జున్ కూడా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో చూడటం కోసం వెళ్ళాడు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో థియేటర్ తొక్కిసిలాట జరగగా అందులో ఒక మహిళ చనిపోయింది.ఆమె కొడుకు హాస్పిటల్ లో గాయాలతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.
ఈ విషయంలో ఏం జరిగిందనేది చనిపోయిన మహిళ భర్త మాట్లాడుతు మా అబ్బాయి అల్లు అర్జున్ అభిమానిగా సినిమా చూడటానికి సంధ్య థియేటర్ కి మా ఆవిడ నేను నైట్ తొమ్మిదిన్నరకి వెళ్ళాం. కానీ మాకు అల్లు అర్జున్ వస్తున్నాడని తెలియదు. ఇక ఆ తర్వాత తెలియడంతో మా బాబు, భార్య అల్లు అర్జున్ రాగానే కొంచం ముందుకు వెళ్లారు.ఆ విధంగా థియేటర్ లోపలకి వెళ్లడంతో పెద్ద ఎత్తున అభిమానులు తొక్కిసలాట జరిగి మా ఆవిడ చనిపోయింది. మా బాబు స్పృహ తప్పి పడిపోయింది కూడా తర్వాత తెలిసింది. ప్రస్తుతం మా బాబు హాస్పిటల్ లో క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. ఇంత వరకు అల్లు అర్జున్ గాని, ఆయన టీం గాని, ఫ్యాన్స్ గాని నన్ను సంప్రదించలేదని చెప్పుకొచ్చాడు.
ఇక చనిపోయిన ఆవిడ మరిది కూడా మాట్లాడటం మా వదిన చావుకి అల్లు అర్జున్ నే కారణం. ఆయన రాకపోతే తొక్కిసలాట జరిగేది కాదు. మా అన్నయ్య కుటుంబానికి తగిన న్యాయం జరగాలని చెప్పుకొచ్చాడు.