Home సినిమా సినిమాలకి గుడ్ బై చెప్తు బిజినెస్ లోకి వెళ్తున్న స్టార్ హీరో – Sneha News

సినిమాలకి గుడ్ బై చెప్తు బిజినెస్ లోకి వెళ్తున్న స్టార్ హీరో – Sneha News

by Sneha News
0 comments
సినిమాలకి గుడ్ బై చెప్తు బిజినెస్ లోకి వెళ్తున్న స్టార్ హీరో


2003 లో రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)దర్శకత్వంలో వచ్చిన ‘కంపెనీ’ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి చిత్ర రంగ ప్రవేశం చేసిన నటుడు వివేక్ ఒబెరాయ్(vivek oberoi) ఆ తర్వాత సాతియా,ఓంకార,మస్తీ,కాల్,రోడ్,క్రిష్ 3 వంటి సినిమాల్లో నటించి అగ్ర హీరో రేంజ్ ని సంపాదించాడు.తెలుగులో కూడా పరిటాలరవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’లో రవి క్యారక్టర్ లో సూపర్ గా చేసి తెలుగు ప్రజల అభిమానాన్ని కూడా పొందాడు.రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామతో పాటు తమిళ మూవీ వివేగం లో కూడా విలన్ గా నటించి తన సత్తా చాటిన వివేక్ కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తూ వ్యాపారంపైనే పూర్తి దృష్టి పెట్టాడు.

రీసెంట్ గా వివేక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.అందులో మాట్లాడుతూ 2007 లో’షూట్ అవుట్ ఎట్ లోకండవాలా’లో నటించాను.సినిమా హిట్ అవ్వడంతో పాటుగా అందులోని ‘గణపత్’ సాంగ్ బాగా పాపులర్ అవ్వడంతో వరుస అవకాశాలు వస్తాయని ఆశించాను.కానీ ఒక్క అవకాశం కూడా రాకపోయేసరికి పదిహేను నెలల పాటు ఇంట్లోనే కూర్చున్నాను. కేవలం సినిమాల మీదే ఆధారపడకూడదని నిర్ణయించుకొని వ్యాపార రంగాన్ని ఎంచుకోను.ఇండస్ట్రీలో ఎప్పుడు మనకి అనుకూలంగా ఉంటుంది ఉండదు.అందుకే ప్లాన్ బిని కూడా లైన్ లో పెట్టుకోవాలి.

నటన అంటే ఇష్టం కాబట్టి ఈ పరిశ్రమకి వచ్చాను. గాని మధ్యవర్తుల లాబీయింగ్ నా భవిష్యత్తుని నిర్ణయించాలని కోరుకోలేదు.అందుకే జీవనోపాధి కోసం వ్యాపార రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను.అధికంగా స్థిరపడడానికి ఇది నాకు మంచి తోడ్పాటుని అందించిందని చెప్పుకొచ్చాడు.ఇక ఈ ఏడాది రిలీజైన ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్ సిరీస్’లో వివేక్ ఒక పాత్ర పోషించిన సిరీస్ ఘన విజయంలో ప్రముఖ పాత్ర పోషించాడు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech