మూడేళ్ళ నిరీక్షణకు తెర పడింది. పుష్ప-1 కి కొనసాగింపుగా రూపొందించిన పుష్ప-2 మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లలో అడుగుపెట్టింది. నిజానికి ఈ సినిమా విడుదల తేదీ డిసెంబర్ 5 కాగా, డిసెంబర్ 4 రాత్రి 9:30 నుంచే ప్రీమియర్స్ మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని చోట్ల ఫస్ట్ హాఫ్ పూర్తయింది. (పుష్ప 2 రూల్)
పుష్ప-2 ఫస్ట్ హాఫ్ కి అదిరిపోయే టాక్ వస్తోంది. నిడివి 100 నిమిషాలు, బోర్ కొట్టకుండా వంద శాతం ఫ్యాన్స్ సంతృప్తి చెందేలా డైరెక్టర్ సుకుమార్ ఫస్ట్ హాఫ్ ని మలిచాడని, డ్రామా బాగా పండిందని అంటున్నారు. ఇక అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ బ్లాక్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్లు చెబుతున్నారు. డైలాగ్స్, అల్లు అర్జున్ యాక్టింగ్ పీక్స్ అని, మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ లో బన్నీ యాక్టింగ్ వేరే లెవెల్ అంటున్నారు. పీలింగ్స్ సాంగ్ ఫస్ట్ హాఫ్ లోనే ఉందని, ఇది ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కి ట్రీట్ అని చెబుతున్నారు. మొత్తానికి అయితే ఫస్ట్ హఫ్ కి బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది.