దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)గత వైసిపి ప్రభుత్వంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(chandrababu naidu) ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)ఐటి శాఖ మంత్రి లోకేష్(lokesh)పై ప్రముఖ అసభ్యపదజాలంతో విరుచుకుపడటమే కాకుండా,సోషల్ మీడియా వేదికగా కూడా ఆ ముగ్గురిపై ట్రోల్స్ చేస్తూ వాళ్ల పరువుకి భంగం కలిగించాడు.అంటే కాకుండా అసత్యాలని ప్రచారం చేస్తూ కొన్ని రకాల సినిమాలు కూడా చేసాడు.
ఇప్పుడు ఈ విషయం మీద ప్రముఖ యూట్యూబర్ సంతు బాబు(santhu babu)మాట్లాడుతు చంద్రబాబు,పవన్ లోకేష్ ని వర్మ తిట్టినందుకు,వ్యతిరేకంగా సినిమా తీసినందుకు గాను వైసిపి ప్రభుత్వం డిజిటల్ కార్పొరేషన్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసి వర్మకి భారీగా డబ్బులు చెల్లించిందని చెప్పుకొచ్చాడు.నెలకి ఇంత అని చెప్పి శాలరీ ఇవ్వడంతో పాటుగా సినిమాలకి డబ్బు కూడా వైసిపీనే ఇచ్చింది.అదంతా కూడా ప్రజల డబ్బే.పైగా వర్మకి డబ్బే ముఖ్యం.దాని కోసం ఎంత నీచానికైనా ఒడికడతాడు.డబ్బు ఇస్తానంటే తన ఇంట్లో వాళ్ళని కూడా తిడతాడని చెప్పుకొచ్చాడు.